వివాదాస్పద సినిమాలు తీస్తూ ఎప్పుడూ బీజీగా ఉండే డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా కొండామురళికి బర్త్ డే విషెస్ తెలిపారు. ‘కొండా మురళి గారికి, కొండా చిత్ర యూనిట్ నుంచి, మరియు నల్ల బల్లి సుధాకర్ గారి నుంచి, జన్మ దిన శుభాకాంక్షలు’ అంటూ ట్విట్ చేశారు. ప్రస్తుతం కొండా అనే టైటిల్ తో కొండా మురళిపై ఆర్జీవీ సినిమా షూటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
గతంలో ఎన్ కౌంటర్ చేయబడ్డ ఆర్కే అలియాస్ రామకృష్ణకు ఇంకా కొండా మురళికి ఉన్న సంబంధంపై ఈ సినిమా తీస్తున్నట్లు ఆర్జీవీ ఇప్పటికే వెల్లడించారు. అంతేకాకుండా ఈ సినిమా తెలంగాణ రక్తచరిత్ర అవుతుందని ఆయన ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు.
కొండా మురళి గారికి, కొండా చిత్ర యూనిట్ నుంచి, మరియు నల్ల బల్లి సుధాకర్ గారి నుంచి, జన్మ దిన శుభాకాంక్షలు💐💐💐
— Ram Gopal Varma (@RGVzoomin) October 23, 2021