ఇటీవల జమ్మూకాశ్మీర్ జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, జేసీవో వీరమరణ పొందారు. దీంతో జవాన్ల వీరమరణం ఘటనలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల స్థావరం కోసం పోలీసులు గాలిస్తుండగా పూంచ్ జిల్లా మెంధార్ వద్ద ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు తెగబడ్డారు. లష్కరే తొయిబా ఉగ్రవాది జియా ముస్తఫాను ఘటనా స్థలికి తీసుకెళ్లిన పోలీసులు.. కాల్పుల వేళ ఉగ్రవాదులు నక్కిన ప్రాంతం గుర్తింపుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు పాల్పడడంతో సీఆర్‌పీఎఫ్…
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయంలో ఎండీఎస్ (మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జన్) కోర్సులో ప్రవేశాల కొరకు వర్సీటీ నోటీఫికేషన్ ను విడుదల చేసింది. కన్వీనర్, యాజమాన్య కోటలో సీట్లు భర్తీ చేయనున్నట్లు వర్సీటీ వెల్లడించింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 2 గంటలకు వరకు చివరి దశ వెబ్ అప్షన్ నిర్వహిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు http://knruhs.telangana.gov.in/ లో వెబ్ సైట్‌లో వెబ్ ఆప్షన్‌లలో వారివారి ప్రాధాన్యతను బట్టి కళాశాలలను ఎంచుకోవాలని…
నేటి సమాజంలో ఎక్కడ చూసిన మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులు మాత్రం మారడం లేదు. ఏలూరు సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న జయరాజు తన సహోద్యోగి మహిళను లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ మేరకు సదరు మహిళా ఉద్యోగి దిశా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రిజిస్టార్ ఆఫీస్‌లోని ఆడిట్ సెక్షన్లో అటెండర్ గా పనిచేస్తున్న మహిళను రిజిస్ట్రార్ జయరాజు తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకటకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై పలు వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పట్టణంలో మురళీధర్ రావు ఫ్లెక్సీ పెట్టారు.. కానీ స్టాంప్ సైజులోనైనా సంజయ్ బొమ్మ కూడా పెట్టలేదు.. విద్యాసాగర్ రావు, మురళీధర్ రావు.. లు నిన్ను ఎంత చిన్నచూపు చూస్తున్నారో బండి…
టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలు రేపు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గచ్చిబౌలి జంక్షన్ కు సైబర్ టవర్స్ మీదుగా వెళ్లేవారు అయ్యప్ప సొసైటీ సీవోడీ జంక్షన్, దుర్గం చెరువు నుంచి వెళ్లాల్సిందిగా సూచించారు. అంతేకాకుండా కొండాపూర్, ఆర్‌సీపురం, చందానగర్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులు బీహెచ్‌ఈఎల్, నల్లగండ్ల, హెచ్‌సీయూ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దీనితో పాటు హఫీజ్‌పేట, మియాపూర్, కొత్తగూడ నుంచి సైబర్ టవర్స్…
పెట్రోల్ ధరలు రాకెట్లా దూసుకుపోతున్నాయి. రోజురోజుకు పెరిగిన పెట్రోల్ ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లుపడుతోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమని వాహనదారులు అంటున్నారు. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు షాక్ అయ్యారు. లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు పెరిగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.111.91కు చేరుకుంది. అంతేకాకుండా డీజిల్ పై 36 పైసలు పెరగడంతో లీటర్ డీజిల్ ధర రూ. 105.08కు చేరకుంది. ఇదిలా ఉంటే విజయవాడలో లీటర్ పెట్రోల్…
హైదరాబాద్‌లోనే కాద యావత్తు దేశంలో టీ20 క్రికెట్ మేనియా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రోజు భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది. అయితే క్రికెట్ ప్రియుల్లో మరింత జోష్ నింపేందుకు సిద్ధమయ్యారు మాజీ క్రికెటర్ అజారుద్దీన్. ట్యాంక్ బంద్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ బ్యాట్‌ను ఏర్పాటు చేశారు. 56.1 అడుగుల పొడవు, 9 టన్నుల బరువున్న ఈ క్రికెట్ బ్యాట్ ను అజారుద్దీన్ ట్యాంక్ బండ్‌పై మాజీ క్రికెటర్ అజారుద్దీన్, తెలంగాణ ఐటీ…
హుజురాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. రోజురోజుకు రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో జోరు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ మహిళా నాయకురాలు డీకే అరుణ హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఊరూరా ఈటల రాజేందర్ కు ప్రజలు నీరాజనం పడుతున్నారని, ఈటల గెలుపు తథ్యమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, హుజురాబాద్‌లో భారీ మెజార్టీతో ఈటల…
చైనా ప్రపంచ శక్తిగా మారేందుకు ప్రయత్నిస్తోందని త్రిధళాధిపతి జనరల్ బిపిన్ రావత్ అన్నారు. చైనా-పాక్ సంబంధంపై మాట్లాడిన బిపిన్.. ఆ దేశాల మధ్య ఉన్న సంబంధం భారత్‌కు వ్యతిరేకం అని అన్నారు. అంతేకాకుండా వివిధ దేశాలలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు చైనా సిద్ధమైందని, ఫలితంగా ఆ దేశాలపై పట్టు సాధించేందుకు ఎత్తుగడలు వేస్తోందని అన్నారు. దక్షిణాసియాలో చైనా చర్యలు ప్రమాదకరంగా మారుతున్నాయని ఆయన అన్నారు. భారత సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. చైనా బలమైన దేశమైనా,…
కరోనా మహామ్మరిని కట్టడి చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా కొన్ని సడలింపులతో లాక్డౌన్ ను తమిళనాడు ప్రభుత్వం పొడిగించింది. నవంబర్ 15వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన ప్రభుత్వం.. నవంబర్ 1నుంచి సినిమా థియేటర్లలో 100 శాతం అక్యుపెన్సీకి అనుమతి ఇచ్చింది. దీనితో పాటు నవంబర్ 1 నుంచి 1-8 తరగతులు రోటేషన్ విధానంలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే…