రాష్ట్రమంతా హుజురాబాద్ ఉప ఎన్నిక మేనియా నడుస్తోంది. ఏ రాజకీయ పార్టీ నాయకులు ఎక్కడికి వచ్చి మాట్లాడినా అందులో హుజురాబాద్ ఉప ఎన్నిక గురించి తప్పక ఉంటోంది. ఈ రోజు కేటీఆర్ టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాల కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్, పీసీసీ రేవంత్ రెడ్డిలు రహస్య ఒప్పందాలు చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై స్పందించిన బీజేపీ మహిళా నేత డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్, ఈటల భేటీ ఫోటో ఉంటే భయటపెట్టు అంటూ కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం టీఆర్ఎస్‌కి అలవాటేనని, ఓడిపోతమన్న భయంతో టీఆర్‌ఎస్ కుట్రలు చేస్తోందన్నారు. లోపాయికారీ ఒప్పందం చేసుకోవడం లో కాంగ్రెస్ దిట్టనని ఆరోపించారు. తనను సీఎం కాకుండా ఈటల అడ్డుకున్నారని కోపంతో ఈటలపై కేటీఆర్ నిందలు వేస్తున్నారన్నారు. ఈ నెల 30న హుజురాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. మరో నాలుగు రోజులు మాత్రమే ప్రచారానికి గడువు మిగిలి ఉంది.