యువ హీరో నాగశౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘వరుడు కావలెను’. ఈ మూవీ ట్రైలర్‌ను గురువారం రాత్రి ఆరడగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి విడుదల చేశాడు. ట్రైలర్ చూస్తుంటే యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఆకాష్ పాత్రలో నాగశౌర్య, భూమి పాత్రలో రీతూ వర్మ కనిపించారు. ఈ మూవీలో పెళ్లి అంటే ఇష్టం లేని యువతిగా రీతూ వర్మ కనిపించనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరుపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి లేడీ డైరెక్టర్…
తెలంగాణలో కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 92.61 శాతం మంది అర్హత సాధించినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు. అయితే ఈ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా అర్హత సాధించారు. మహిళలు 41,131 మంది క్వాలిఫై కాగా పురుషులు 22,614 మంది మాత్రమే అర్హత సాధించడం గమనార్హం. అంటే పురుషుల కంటే రెట్టింపు స్థాయిలో మహిళలు క్వాలిఫై అయ్యారు. గత ఏడాది కూడా మహిళలే…
ఏపీ సీఎం జగన్‌ను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్ట్ చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను విజయవాడ గవర్నర్ పేట పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. గురువారం మధ్యాహ్నం విజయవాడలోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. తాను మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తికి పట్టాభి వివరణ ఇచ్చారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పట్టాభిపై పోలీసులు సెక్షన్ 153 (ఎ), 505 (2) , 353, 504 రెడ్ విత్…
ఇప్పటివరకు మనం క్రికెట్‌లో ఒక ఓవర్లో 6 సిక్సర్లు కొట్టడం చూశాం. కానీ ఆస్ట్రేలియాలో జరిగిన ఓ క్లబ్ క్రికెట్ మ్యాచ్‌లో అరుదైన సంఘటన జరిగింది. పెర్త్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెటర్ ఒకే ఓవర్‌లో 8 సిక్సులు కొట్టి ఔరా అనిపించాడు. ఈనెల 19న సొరెంటో డన్‌క్రెయిగ్ సీనియర్ క్లబ్, కింగ్‌స్లే ఉడ్‌వేల్ సీనియర్ క్లబ్ జట్ల మధ్య 40 ఓవర్ల మ్యాచ్ నిర్వహించారు. అయితే ఈ మ్యాచ్ రికార్డుల్లోకి ఎక్కడం విశేషం.…
ప్రముఖ పేమెంట్స్ దిగ్గజ సంస్థ పేటీయంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) షాకిచ్చింది. పేటియం పేమెంట్స్ బ్యాంక్ ఫైనల్ సర్టిఫికేట్ ఆఫ్ అథరైజేషన్ జారీ చేయాలని కోరుతూ ఆర్బీఐకి దరఖాస్తు చేసుకుంది. దీంతో ఈ దరఖాస్తును పరిశీలించగా అసలు విషయాలు బయటకు వచ్చాయి. 2007 పేమెంట్, సెటిల్మెంట్ సిస్టమ్స్ నిబంధనల ఉల్లఘించినట్లు తేలింది. అక్టోబర్ 20న పేటియం కొన్ని నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను కోటి రూపాయల జరిమానాను పీపీబీఎల్(PPBL)కు విధించింది. ఫైనల్ ధృవీకరణ పత్రం కోసం…
ఏపీలో రాజకీయ నాయకులు నువ్వేంత అంటే నువ్వేంత అన్నట్టు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలు తారాస్థాయి చేరకున్నాయి. ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష ప్రారంభించారు. మరో వైపు పట్టాభిరామ్ సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నాయకులు జనాగ్రహా దీక్షకు దిగారు. అంతేకాకుండా టీడీపీ, వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలు దిగారు. ఎప్పడూ వివాదాలతో నిద్రలేచే ఆర్జీవీ ఏపీ రాజకీయాలపై ట్విట్టర్…
ఇంజినీరింగ్ పుల్ టైమ్ పీహెచ్డీ ప్రవేశాలకు జేఎన్టీయూహెచ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 2017-2021 ల మధ్య యూజీసీ నెట్, గేట్ స్కోర్ ఆధారంగా విద్యార్థులకు సీట్లను కేటాయించనున్నట్లు వర్సటీ డీఏవో డా.వెంకటరమణారెడ్డి తెలిపారు. అక్టోబర్ 26 సాయంత్రంలోగా జేఎన్ టీయూ వెబ్ సైట్ https://jntuh.ac.in/ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా డౌన్ లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తి సమాచారంతో నింపి, సంబంధిత ధృవీకరణ పత్రాలతో గడువులోపు జేఎన్టీయూహెచ్ లో అందజేయాలని ఆయన…
నేటి సమాజంలో రోజుకో చోట ఆత్యాచార సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చిన మృగాళ్లు మాత్రం మారడం లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా తామ కామవాంఛ తీర్చకుంటున్నారు. అన్యం పుణ్యం తెలియని చిన్నారుల జీవితాలతో చెలగాటం అడుతున్నారు. ఇలాంటి ఘటనే రాజేంద్ర నగర్ లోని హిమాయత్ సాగర్ లో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్ సాగర్ కు చెందిన కాంతు అనే వ్యక్తి…
ఈశాన్య చైనా లియోనింగ్ ప్రావిన్స్‌లోని షెన్యాంగ్లో గల రెస్టారెంట్లో భారీ పేలుడు సంభవించింది. ఉదయం 8.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 33 మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు దాదాపు 30 ఫైర్ ఇంజన్లను మోహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ పేలుడుతో 3 అంతస్థుల రెస్టారెంట్ భవనం కుప్పకూలిపోయింది. అంతేకాకుండా చుట్టుపక్కల పార్క్ చేసిన వాహనాలు…
తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పాఠశాల విద్యాశాఖలో 5323 పోస్టుల తాత్కాలిక భర్తీకి అనుమతిస్తూ ఆర్ధిక శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలకు 2,343 ఇన్ స్ట్రక్టర్లు, 1,435 ఉపాధ్యాయులు, వ్యాయమ ఉపాధ్యాయలు, కేజీబీవీలకు 937 పోస్టు గ్రాడ్యుయేట్ రెసిరెన్షియల్ టీచర్ల పోస్టులు, ఆదర్శ పాఠశాలలకు 397 ఒకేషనల్ ట్రైనర్లు, ఒకేషనల్ కో-ఆర్డినేటర్లు, ప్రభుత్వ ఎంఈడీ కళాశాలలకు 211 బోధనా సిబ్బంది పోస్టులకు తాత్కాలిక ప్రతిపాదికన భర్తీ చేసేందుకు అనుమతులు జారీ…