హుజురాబాద్ ఉప ఎన్నికకు ఈ రోజు సాయంత్రంతో ప్రచార సమయం ముగియనుంది. దీంతో నాయకులు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ.. ఓటర్లను తిప్పుకునేందుకు చివరి ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్‌లో ఓటమి ఖాయమని తెలిసి ప్రస్టేషన్‌తో కొంతమంది ఫోన్లు పగలకొడుతున్నారట అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులు మాపై ఇచ్చిన ఫిర్యాదులతో మేము ఉన్న ఇండ్లను అధికారులు తనిఖీలు చేశారని ఆయన అన్నారు. మా ముఖ్యమంత్రి సభ పెట్టకుండా…
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు వారం రోజుల క్రితం మొదలు పెట్టిన బూతు డ్రామాకు నిన్న తెర దించారని సజ్జల వ్యాఖ్యానించారు. ఏపీలో సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ఈ డ్రామాకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. అబద్దాలు, డ్రామాలు, విధానాలను అలవోకగా మార్చడం చంద్రబాబు తెలిసిన ఏకైక విద్య అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసే…
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పెట్టుబుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ)తో ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. రాష్ట్రంలో భారీ పర్యాటక ప్రాజెక్టులపై బోర్టు సమావేశం నిర్వహించగా..పలు ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఒక్కో ప్రాజెక్టుపై కనీసం రూ.250 కోట్లు పెట్టుబడులు వస్తాయని వెల్లడించింది. అంతేకాకుండా వివిధ ప్రాజెక్టులపై రూ.2,868.6 కోట్ల పెట్టుబడులు వస్తాయని తెలిపింది. ప్రాజెక్టుల ద్వారా ఐదేళ్లలో 1,564 గదుల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసువస్తామని తెలిపారు. ఓబెరాయ్…
నందమూరి బాలకృష్ణ త్వరలోనే ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆహా ఓటీటీ ద్వారా అన్‌స్టాపబుల్ అనే టాక్ షో ద్వారా ఆయన హోస్ట్ అవతారంలో కనిపించనున్నాడు. తాజాగా ఈ షోకు సంబంధించి ప్రోమో విడుదల చేయగా.. అందులో యాంకర్‌గా బాలయ్య ఆకట్టుకుంటున్నాడు. ఈ ప్రోమోలో ‘నీకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు.. నీకు లక్ష్య సిద్ధి ఉన్నప్పుడు.. నీకు సంకల్ప సిద్ధి ఉన్నప్పుడు నిన్ను పంచభూతాలు ఆపలేవు.. మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాపింగ్ ఉండదు.. సై అంటే సై…. నై…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో పలువురు జోనల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. అయితే ఈ బదిలీల్లో ట్విస్ట్ చోటుచేసుకుంది. కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మమత మరోసారి తన స్థానాన్ని వదులుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కూకట్‌పల్లిని వీడేందుకు మమత విముఖత చూపారు. దీంతో ఆమెను కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గానే కొనసాగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. Read Also: రెండు రోజుల పాటు నీటి సరఫరా…
పర్యాటకులకు మంత్రి అవంత శ్రీనివాస్ శుభవార్త చెప్పారు. గత కొన్ని నెలల నుంచి నిలిచిపోయిన పాపికొండల బోటింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బుధవారం బోటు ఆపరేటర్లతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో టూరిజం, నీటి పారుదల శాఖ అధికారులు, బోటు ఆపరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నవంబర్ 7 నుంచి పాపికొండల్లో బోటింగుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. పర్యాటకులకు బోట్లలో నిబంధనల ప్రకారం…
ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఏడు గురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ మండలంలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయనే వార్తలు రావడంతో స్పందించిన అధికారులు విచారణ చేపట్టారు. సుమారు రూ.3.5 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు విచారణలో అధికారులు గుర్తించారు. దీంతో ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా పంచాయతీ అధికారిణిగా ఉన్న పార్వతిని సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కోన శశిధర్…
హైదరాబాద్ మెట్రో రైలులో ఓ గర్భిణీ మహిళ కింద కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మెట్రో రైలులో ప్రయాణించే వారికి కనీసం మానవత్వం లేదా అనే కామెంట్లను పెడుతున్నారు. మనిషి అన్న తర్వాత ఇతరుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని కోరుతున్నారు. అయితే ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఆర్టీసీ బస్సుల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశమే లేదని ఓ ట్వీట్ ద్వారా ఆయన స్పష్టం చేశారు. Read Also: షర్మిల…
రోజురోజుకు ఏపీలో టీడీపీ, వైసీపీ నేల మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. సీఎం జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలతో ఏపీలో నిరసన జ్వాలలు చెలరేగాయి. అంతేకాకుండా గత పది రోజుల నుంచి వైసీపీ, టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. చంద్రబాబు టెర్రరిస్టు అంటూ ఇటీవల విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కౌంటర్ ఇచ్చారు.…
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో ఈనెల 29, 30 తేదీల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం కలగనుంది. మంజీరా ఫేజ్-2 పైపులైన్లకు మరమ్మతులు నిర్వహిస్తున్న కారణంగా నీటి సరఫరా బంద్ కానుందని జలమండలి ప్రకటించింది. కలగ్గూర్ నుంచి పటాన్ చెరువు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్పీ పంపింగ్ పైప్‌లైనుకు సంబంధించి వివిధ ప్రాంతాలలో లీకేజీలను నివారించేందుకు మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల…