రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిరసనగా రేపటి నుంచి రేషన్ షాపులకు బంద్‌కు పిలునిచ్చిన రేషన్ డీలర్లు వారి నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. కానీ.. ప్రభుత్వం స్పందించేంతవరకు ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని విజయవాడలో రేషన్ డీలర్ల సంఘం నేతలు ప్రకటించారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కమిషన్ బకాయిలు 2020 నుంచి చెల్లించడం లేదన్నారు.
వాటితో పాటు గోనె సంచుల బకాయిలు చెల్లించడం లేదని, తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. అంతేకాకుండా వచ్చేనెల రేషన్ సరుకులు దిగుమతి చేసుకోకూడదని తీర్మానం చేసుకున్నట్లు వారు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకపోతే బంద్ కు దిగుతామని స్పష్టం చేశారు.