తెలంగాణలో గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు, దివంగత నేత వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. షర్మిల పాదయాత్ర బుధవారం నాటికి 8వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. బుధవారం నాడు షర్మిల పాదయాత్రలో ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్యామల తన భర్తతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ శ్యామల మాట్లాడుతూ… సమాజంలో మార్పు…
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతోంది. ఈ రోజు సాయంత్రంతో ఉప ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు నాయకులు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయిన్‌పల్లి వినోద్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ని గెలిపించే బాధ్యత మీది.. హుజురాబాద్ అభివృద్ధి మాది అంటూ వ్యాఖ్యానించారు. కమలాపూర్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని…
టీవీఎస్ సంస్థకు చెందిన టూ వీలర్ వాహనాలలో స్కూటీలకు ఉన్న ప్రత్యేకతే వేరు. భారత్‌లో టీవీఎస్ స్కూటీలు ఎంత ఆదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో టీవీఎస్ స్కూటీల విక్రయాలు భారత్‌లో 50 లక్షల మైలురాయికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా టీవీఎస్ సంస్థ వెల్లడించింది. మూడు దశాబ్దాలుగా తమ స్కూటీ వాహనాలకు మహిళలకు మెరుగైన ఎంపికగా ఉన్నందుకు తమకు గర్వగా ఉందని ఓ ప్రకటనలో తెలియజేసింది. ఇతర కంపెనీలతో పోలిస్తే తమ…
హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో పలువురు యువకులు మత్తుకు బానిసై దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజేఆర్ నగర్, మల్లికార్జునా నగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… స్థానికంగా నివాసం ఉండే నవీన్ అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఆ యువతి వెంటపడ్డాడు. నవీన్ మత్తుకు బానిసై చిల్లరగా తిరుగుతూ తన కూతురు వెంటపడుతున్నాడని యువతి…
తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యక్తిగత జీవితంపై కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ప్రసారం చేయడంతో హీరోయిన్ సమంత హైదరాబాద్‌లోని కూకట్ పల్లి కోర్టులో పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై మంగళవారం కూకట్ పల్లి కోర్టులో వాదనలు జరగ్గా.. సమంతకు ఊరట కలిగేలా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. సమంత వ్యక్తిగత వివరాలను ఎవ్వరూ ప్రసారం చేయడానికి వీలు లేదని కూకట్ పల్లి కోర్టు స్పష్టం చేసింది. Read Also: యంగ్ హీరోకు సాయంగా బన్నీ…
భారత జట్టు మాజీ ఆటగాడు, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖరారైంది. ఇటీవల నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ పదవికి రాజీనామా చేసిన అతడు… మంగళవారం నాడు టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు సమర్పించాడు. ద్రవిడ్‌తో పాటు అతడి సన్నిహితుడు పరాస్ మాంబ్రే బౌలింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. మరోవైపు ఫీల్డింగ్ కోచ్ పదవికి భారత మాజీ క్రికెటర్, హర్యానాకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్…
దేశంలో వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం నాడు ఆ పార్టీ ముఖ్య నేతలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కీలక విషయాలను ప్రస్తావించారు. వివిధ రాష్ట్రాలలో నేతల మధ్య సమన్వయం కొరవడిందని.. వారి మధ్య వారికే స్పష్టత కరువైందని సోనియా అసహనం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలపై పోరాడాలో కూడా కొంతమంది నేతలకు తెలియడం లేదని ఆమె ఫైర్ అయ్యారు.…
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కొన్నిరోజులుగా అక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం పలు చర్యలు చేపట్టింది. చైనా వ్యాప్తంగా సోమవారం 29 కరోనా కేసులు నిర్ధారణ కాగా.. అందులో ఆరు కేసులు చైనా వాయువ్య ప్రావిన్సు గాన్సు రాజధాని లాన్‌జౌలో నమోదయ్యాయి. దీంతో 40 లక్షల జనాభా గల లాన్జౌ నగరంలో లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు అత్యవసరం అని భావిస్తే మాత్రమే ఇళ్ల…
తెలంగాణలో ఆంత్రాక్స్ చాప కింద నీరులా విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం రేపుతోంది. దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు గొర్రెలు చనిపోయాయి. గొర్రెల వరుస మరణాలను ఆంత్రాక్స్ కారణమని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సాంబయ్య అనే వ్యక్తి పెంచుకుంటున్న గొర్రెల మందలో కొన్నిరోజులగా రోజుకొక గొర్రె చనిపోతుండటంపై పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానికులు పశువైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వైద్యులు చనిపోయిన…
ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగతున్నాయి. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై టీడీపీ, వైసీపీ నేతలు విమర్శలు చేసుకుంటునే.. మరో వైపు గత టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. వారి మాటలపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు పలు వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చి 29 నెలలు గడిచినా…