దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నాడు మరోసారి కుదేలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా అమ్మకాల ఒత్తిడిని తట్టుకోలేక సెన్సెక్స్ భారీ నష్టాలను చవి చూసింది. ఉదయం పూట నష్టాలతోనే మొదలైన మార్కెట్లు చివరి వరకు అదే ధోరణిని కొనసాగించాయి. దీంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1158 పాయింట్లు దిగజారి 59,984 వద్ద స్థిరపడింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ కూడా 353 పాయింట్లు నష్టపోయి 17,857 పాయింట్ల వద్ద ముగిసింది. ఈరోజు…
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 29న కుప్పంలో పర్యటించనున్నారు. గత పది రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాల దృష్యా కుప్పంలో చంద్రబాబు పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కుప్పంలో రెండు రోజులు పర్యటించనున్న చంద్రబాబు.. 29 కుప్పంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. మరుసటి రోజు 30న కుప్పం పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తారు. అయితే గత పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. కుప్పంలో టీడీపీ ఉనికి కొల్పొకుండా ఉండేందుకు గ్రామస్థాయి…
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. లాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు కొనుగోలు చేయలేని పరిస్థితిలో చాలా మంది పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. అలాంటి వారికోసం గవర్నర్ తమిళసై ఓ అడుగు ముందుకువేసి నిరుపయోగంగా ఉన్న ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని ఐటీ కంపెనీలను, సంస్థలను ఆమె విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా రాజ్‌భవన్‌లో దీని కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.…
రోడ్డుపై వెళుతుంటే అనుకోకుండా చిన్నచిన్న జంతువుల మనకు తారసపడుతూనే ఉంటాయి. కానీ.. ఏకంగా ఓ మొసలి జాతీయ రహదారిపై కనిపిస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఘటనే విజయనగరం రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని నెలివాడ చెరువు సమీపంలోని రోడ్డుపైన మొసలి ప్రత్యక్షమైంది. దీంతో ఆ మొసలిని గమనించిన వాహనదారులు రోడ్డుకు ఇరువైపులా ఆగిపోయారు. దాదాపు గంటసేపు మొసలి రోడ్డుపైనే ఉండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తరువాత మొసలి సమీపంలోని…
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న సామాన్యులకు మరో షాక్ తగలనుంది. రికార్డు స్థాయికి చేరిన వంట గ్యాస్ ధరను చమురు సంస్థలు మరోసారి పెంచేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీపావళికి ముందే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు 60 శాతం పెరగడంతో.. దేశీయంగా గ్యాస్ సిలిండర్ ధర మరో రూ.100 వరకు పెరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే ధరలు పెరగాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతి…
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తమిళ మూవీ ‘అన్నాత్తె’ తెలుగులో ‘పెద్దన్న’గా రాబోతోంది. ఈ మేరకు బుధవారం చిత్ర యూనిట్ పెద్దన్న మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఈ చిత్రంలో హీరో రజనీకాంత్‌కు చెల్లెలి పాత్రలో మహానటి ఫేం కీర్తి సురేష్ నటించింది. మరోవైపు నయనతార, మీనా, ఖుష్బూ వంటి నటీమణులు కీలక పాత్రలను పోషించారు. Read Also: తమన్నా పరువు అడ్డంగా తీసిన ‘మాస్టర్ చెఫ్’ యాజమాన్యం ‘నువ్వు…
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. గత నెల 28న హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిననాటి నుంచి నేటి వరకు కరీంనగర్ కమిషనరేట్, వరంగల్ కమిషనరేట్ సంబంధించి కమలాపూర్ మండల పరిధిలో ఎన్నికల దృష్ట్యా 10 చెక్ పోస్టులు, 10 ఫ్లయింగ్ స్క్వాడ్, 5 ఏంసీసీ, 10 వీఎస్‌టీ లను ఏర్పాటు చేసి, పకడ్బందీగా ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నామని తెలిపారు. తనిఖీల్లో…
సెల్‌ఫోన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. రిలయన్స్ జియో-గూగుల్ కలిసి రూపొందిస్తున్న జియో ఫోన్ ‘నెక్స్ట్’ లాంచింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ ఫోన్‌ను దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో కొత్తగా స్మార్ట్‌ఫోన్లకు అలవాటు పడిన వారి సంఖ్య బాగా పెరిగిందని అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ భాషలు మాట్లాడే వారికి కూడా అందుబాటు ధరలో ఫోన్‌ను తీసుకురావడం ఆనందంగా…
టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-1లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 124/9 స్కోరు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా బ్యాట్స్‌మెన్‌లో ముష్ఫీకర్ రహీమ్ (29), మహ్మదుల్లా (19), నసమ్ అహ్మద్ (19), నూరుల్ హసన్ (16), మెహిదీ హసన్ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టైమల్ మిల్స్ 3 వికెట్లు,…
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ లోక్‌సత్తా నేతపై దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. లోక్‌సత్తా పార్టీకి చెందిన వెంకటరమణ రాయదుర్గంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కంట్లో కారం కొట్టి కర్రలతో దాడికి యత్నించారు. దీంతో వెంకటరమణ తన వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ వైపు పరుగులు తీశారు. వెంకటరమణను దుండగులు ద్విచక్ర వాహనాలపై వెంబడించినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ కు…