చంద్రబాబుకు ఫోన్ చేసిన అమిత్ షా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలు భగ్గమన్నాయి. ఈ ఘటనపై నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు 36గంటల దీక్ష కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్ర పరిణామాలను వివరించేందుకు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీకి వెళ్లిన ఆయన సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కలిసి ఏపీలో జరుగుతున్న పరిస్థితులను వివరించారు. టీడీపీ కార్యాలయంపై దాడితో పాటు రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విషయంపై కూడా రాష్ట్రపతికి వెల్లడించారు. అనంతరం మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేశారు.
కానీ.. కశ్మీర్ పర్యటనలో ఉన్న అమిత్‌షా నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. వెనువెంటనే కౌన్సిల్ మీటింగ్ నిర్వహించడంతో.. ఆ మీటింగ్ లో పాల్గొన్నారు. దీంతో అమిత్‌షాను చంద్రబాబు కలవలేకపోయారు. చంద్రబాబు కలిసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిన అమిత్ షా ఈ రోజు స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అమిత్ షాకు వివరించారు. అంతేకాకుండా ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోందని అమిత్ షాకు తెలిపినట్లు సమాచారం.
Also Read
- Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
తాజావార్తలు
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!