తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యక్తిగత జీవితంపై కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ప్రసారం చేయడంతో హీరోయిన్ సమంత హైదరాబాద్‌లోని కూకట్ పల్లి కోర్టులో పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై మంగళవారం కూకట్ పల్లి కోర్టులో వాదనలు జరగ్గా.. సమంతకు ఊరట కలిగేలా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. సమంత వ్యక్తిగత వివరాలను ఎవ్వరూ ప్రసారం చేయడానికి వీలు లేదని కూకట్ పల్లి కోర్టు స్పష్టం చేసింది.
Read Also: యంగ్ హీరోకు సాయంగా బన్నీ
మరోవైపు సమంత కూడా వ్యక్తి గత వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలని కోర్టు హితవు పలికింది. సమంతకు సంబంధించిన యూట్యూబ్ లింకులను వెంటనే తొలగించాలని మూడు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులకు కూకట్ పల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా సమంత విడాకులు ఇంకా తీసుకోలేదని.. ఈలోగానే ఆమెపై ఇలా దుష్ప్రచారం చేయడం తీవ్రమైన నేరమని ఇటీవల సమంత తరఫు న్యాయవాది బాలాజీ కూకట్ పల్లి కోర్టులో వాదించిన సంగతి తెలిసిందే.