ప్రేమ మత్తు.. యువతి ఇంటిని తగులబెట్టిన యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో పలువురు యువకులు మత్తుకు బానిసై దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజేఆర్ నగర్, మల్లికార్జునా నగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… స్థానికంగా నివాసం ఉండే నవీన్ అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఆ యువతి వెంటపడ్డాడు. నవీన్ మత్తుకు బానిసై చిల్లరగా తిరుగుతూ తన కూతురు వెంటపడుతున్నాడని యువతి తల్లిదండ్రులు గమనించారు. దీంతో నవీన్‌ను వారు మందలించారు.
Read Also: భాగ్యనగర వాసులకు.. జలమండలి కీలక సూచనలు
Also Read
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
దీంతో కక్ష పెంచుకున్న నవీన్ వాళ్ల అంత చూస్తానని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో యువతి ఇంటిని ఎవరు లేని సమయంలో పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఈ ఘటనలో బాధితుల ఇంటితో పాటు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనపై బాధితులు జవహర్ నగర్ పోలీసులను ఆశ్రయించగా స్పాట్ కు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. వెంటనే నిందితుడు నవీన్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్ నిమిత్తం చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా నవీన్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటై చిల్లరగా తిరుగుతుంటాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
-
Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
-
Gold – Silver Prices: రూ. 8 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత పతనం అయ్యిందంటే!
-
OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..