సూర్యాపేట డీఎంహెచ్‌వో కుటుంబంలో 6గురికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. సూర్యాపేటలో డీఎంహెచ్‌వో విధులు నిర్వహిస్తున్న కోటాచలం కుమారుడు గత 5 రోజుల క్రితమే జర్మనీ నుంచి వచ్చాడు. అయితే ఇటీవలే కోటాచలం కుటుంబ సభ్యులతో సహా తిరుపతికి వెళ్లివచ్చారు. అయితే తిరుపతి నుంచి వచ్చిన తరువాత కోవిడ్ లక్షణాలు కనిపించడంతో కోటాచలం కుటుంబ సభ్యులు కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకున్నారు. కరోనా పరీక్షల్లో కోటాచం భార్య, కుమారు, కోడలుకు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ రోజు డీఎంహెచ్‌వో కోటాచలంకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. అయితే నిన్న ఎయిడ్స్‌డే కార్యక్రమంలో పాల్గొన్న కోటాచలం పలువురు సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించటంతో ఇటు సూర్యాపేటలో, అటు తిరుపతిలో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.