ఫ్లాష్.. ఫ్లాష్.. ఇండియాలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మరి ప్రపంచాన్ని వదలనంటోంది. గత సంవత్సరంలో జనవరి 30న కరోనా కేసు కేరళలో నమోదైంది. అయితే అప్పటి నుంచి భారత్‌ను వణికిస్తున్న కరోనా మహమ్మరిని ఎదుర్కునేందుకు శాస్త్రవేత్తలు శ్రమించి కోవిడ్ టీకాలను కనుగోన్నారు. దీంతో ఇప్పుడిప్పుడే కరోనా రక్కసి ప్రభావం ఇండియాపై తగ్గుతున్న తరుణంలో దక్షిణాఫ్రికాలో మరో కరోనా వేరియంట్ బయటపడింది. ఈ వేరియంట్ వెలుగులోకి వచ్చి 10 రోజులే అవుతున్నా దీని వ్యాప్తి మాత్రం కరోనా డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు అధికంగా ఉంది. దీంతో ఇప్పటికే పలు దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అయితే ఒమిక్రాన్‌పై మోడీ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు.
అంతేకాకుండా ఒమిక్రాన్ వేరియంట్‌పై ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచనలు కూడా ఇచ్చింది కేంద్రం. అయితే గత 10 రోజుల నుంచి ఒమిక్రాన్ సోకిన దేశాల నుంచి వేలాది సంఖ్యలో భారత్‌కు ప్రయాణికులు వచ్చారు. దీంతో ఇండియాలో కూడా ఒమిక్రాన్ వ్యాపించి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రకటించింది. అయితే విదేశాల నుంచి వచ్చి ఇద్దరు వ్యక్తుల్లో ఈ ఒమిక్రాన్ వైరస్ బయట పడింది. ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల వయస్సు 66, 46 ఏళ్ళుగా తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింది.
Also Read
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!