మరోసారి భారత్‌లో లాక్‌డౌన్ తప్పదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ దేశాలతోపాటు అగ్రరాజ్యమైన అమెరికాను సైతం గడగడలాడించింది కరోనా మహమ్మారి. కరోనా ధాటికి ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. కరోనా సోకి ఇంటి పెద్దలు మృతి చెందడంతో చాలా మంది చిన్నారులు అనాథలు మారారు. కరోనా రూపాంతరం చెంది డెల్టా వేరియంట్‌గా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో కరోనాను ఎదుర్కునేందుకు ఎంతో శ్రమించి శాస్త్రవేత్తలు కోవిడ్ వ్యాక్సిన్లను కనుగొన్నారు. అయితే కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నమ్మి ప్రజలు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.
ప్రస్తుతం వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో దక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్ వెలుగులోకి రావడంతో మరోసారి ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. తగ్గుముఖం పడుతున్న కరోనా నుంచి ఇప్పుడిప్పుడే పలు దేశాలు కోలుకుంటున్నాయి. కరోనా విజృంభన సమయంలో విధించి లాక్‌డౌన్ కారణంగా భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతున్న సమయంలో ఇప్పుడు మరో కొత్త వేరియంట్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా భారత్‌లో కూడా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రెండు నమోదు కావడంతో ప్రజల్లో భయం మరింత పెరిగింది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ ఇండియా వస్తుందా..? వస్తే ఎలా ఎదుర్కొవాలి..? అనే ప్రశ్నలతో అధికార యంత్రాంగం మునిగిపోయింది.
Also Read
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
- US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
ఆ ప్రశ్నలకు జవాబులు సమాధానం దొరకక ముందే ఒమిక్రాన్ ఇండియాపై దాడి మొదలు పెట్టింది. కర్ణాటకలోని బెంగూళూరు ఎయిర్‌పోర్టుకు నవంబర్ 11న ఒకరు, నవంబర్ 20 మరొకరు ఒమిక్రాన్ సోకిన దేశాల నుంచి వచ్చారు. అయితే వారికి కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యలు కరోనా పాజిటివ్ రావడంతో వారిని ఐసోలేషన్‌లో పెట్టి జినోమ్ సీక్వెన్సికి పంపించారు. జినోమ్ ఫలితాల్లో ఒమిక్రాన్‌గా తేలడంతో భారత్‌లో మరోసారి టెన్షన్ మొదలైంది. ఒమిక్రాన్ సోకిన వారి కాంటాక్ట్ లిస్టును కూడా ట్రేస్ చేసి ప్రస్తుతం వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనితో పాటు ఒమిక్రాన్ సోకిన దేశాల్లో ఒకటైన బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన మహిళకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో జినోమ్ సీక్వెన్సీకి ఆమె శాంపిల్స్‌ను వైద్యులు పంపించారు. ఇదిలా ఉంటే.. ఒమిక్రాన్ కేసులు ఇండియాలో వెలుగుచూసిన నేపథ్యంలో భారతీయుల్లో నెలకొన్న ప్రశ్న ఒక్కటే..? మొదట కరోనా ఫస్ట్ వేవ్ వ్యాప్తి చెందినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 3 నెలల పాటు లాక్‌డౌన్ విధించాయి.
ఆ తరువాత డెల్టా వేరియంట్ రూపంలో 3రెట్ల వేగంతో మరోసారి కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో మరోమారు లాక్‌డౌన్‌కు విధించక తప్పలేదు. అయితే ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే 6రెట్ల వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో మరోసారి భారత్‌లో లాక్‌డౌన్ తప్పదా..? అనే ప్రశ్న ప్రస్తుతం అందరి మదిలో మెదులుతోంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఒమిక్రాన్ ను ఎంతమేర కట్టడి చేస్తాయో చూడాలి మరి.
తాజావార్తలు
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!