వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఘటన గుంటూరు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. నిన్న వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఘటనలో పోలీసులు ఇద్దరు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దీంతో వారి అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ నేత అరవింద్ బాబు ధర్నా చేపట్టారు. పోలీసులు అరవింద్ బాబు ధర్నా చేపట్టిన స్థలానికి చేరుకొని ధర్నా ఆపే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో అరవింద్‌కు గాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.…
కరోనా రక్కసి ఎవ్వరినీ వదలడం లేదు. ఇప్పటికే కరోనా సోకి కోలుకున్న వారు సైతం కరోనా బారినపడుతున్నారు. ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత కరోనా కేసుల సంఖ్యం దేశవ్యాప్తంగా పెరుతూవస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్‌డౌన్‌లు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఈ నెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే తెలుగువారికి ప్రత్యేకమైన సంక్రాంతి పండుగను పురస్కరించికొని నైట్ కర్ఫ్యూను 18వ తేదీ నుంచి పెడుతున్నట్లు…
బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ఏర్పడ్డ తెలంగాణలో వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యం సూర్యాపేటలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటజిల్లాలో అకాల వర్షాల పట్ల అధికారులను అప్రమత్తం చేశారు. ఈ…
నిన్న వైఎస్సాఆర్ విగ్రహం ధ్వంసమైన ఘటన వివాదం రేపుతోంది. అయితే వైఎస్సాఆర్ విగ్రహ ధ్వంసం ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్ట్ చేసిన టీడీపీ కార్యకర్తలను వదిలిపెట్టాలని నరసరావుపేటలోని జొన్నలగడ్డలో టీడీపీనేత అరవింద్ బాబు టీడీపీ కార్యకర్తలతో ధర్నా దిగారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు అరవింద్ ధర్నా చేస్తున్న స్థలానికి చేరుకున్నారు. అయితే ధర్నా విరమించాలని అరవింద్‌ను పోలీసులు కోరగా అరవింద్‌కు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.…
ఇటీవల ఎన్నికల సంఘం (ఈసీ) ఐదు రాష్ట్రాలకు ఎన్నిలక షెడ్యూల్‌ను విడుదల చేసింది. 7 దశల్లో 5 రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో గోవాలో కూడా ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఇప్పటికే ఆమ్‌ఆద్మీ పార్టీ గోవాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గోవా ఓటర్లకు హామీలు గుప్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో అధికారంలోకి వస్తే రూ.3 వేలు నిరుద్యోగ భృతి…
పోలీసులపై పేకాటరాయుళ్లు దాడి చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. భీమడోలు మండలం గుండుగొలనులో నిన్న అర్థరాత్రి పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం మేరకు పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే పోలీసులు దాడులు నిర్వహించడంతో పేకాటరాయుళ్లు తిరుగబడి పోలీసులపైనే దాడులు చేశారు. ఈ దాడిలో పోలీసులు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసుల నమోదు చేసుకున్నా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దాడిచేసిన నిందితులు ఏలూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. నిందితులు…
నెక్లెస్ రోడ్డులో స్ఫూర్తి స్థల్‌లో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 80వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి లేకపోయినా ఆయన సాధించిన తెలంగాణలో మనము ఉన్నామన్నారు. రాజకీయ విలువలు కాపాడడంలో జైపాల్ రెడ్డి ఒకరని, దేశానికి వన్నె తెచ్చే నిర్ణయాలు జైపాల్ రెడ్డి తీసుకున్నారని గుర్తు చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్‌లో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఆయన…
రాజేంద్రనగర్ హైదర్‌గూడ లోని ఇష్తా సిటీ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 521 ఫ్లాట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది చూసిన అపార్ట్‌మెంట్ వాసులు బయటకు పరుగులు పెట్టారు. మంటలు భారీగా మంటలు వ్యాప్తించి అగ్నికీలలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. అయితే ఇంట్లోని సామాగ్రి పూర్తి…
అనంతపురం జిల్లాలో శిల్పకళా క్షేత్రం లేపాక్షి ఆలయ సమీపంలో అతి పురాతనమైన రాతి స్థంభాలు బయటపడ్డాయి. జాతీయ రహదారి పనులకు చేపట్టిన పనుల్లో రాతి స్థంభాలు వెలుగుచూసాయి. దీంతో ఈ వార్త స్థానికులకు తెలియడంతో రాతి స్థంభాలను చూసేందుకు జనం ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పురావస్తు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే రహదారి పనుల్లో బయటపడ్డ వాటిని మట్టిలో పూడ్చకుండా గ్రామస్థులు అడ్డుకున్నారు. చెరువులో అప్పట్లో ఆలయం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ…
దేశంలో కరోనా తగ్గనంటోంది. రోజురోజుకు కరోనా కేసులు దేశవ్యాప్తంగా పెరుతూవస్తున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. థర్డ్‌వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలు విధించాయి. ఏపీలో కూడా ఈ నెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో కూడా కరోనా కేసులు…