సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి ఆలయంలో భక్తులతో రద్దీగా మారింది. నేటి నుంచి కొమురవెల్లి మల్లన్న దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. నేడు పట్నంవారంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కరోనా దృష్ట్యా అంతర్గతంగా అగ్నిగుండాలు, పెద్దపట్నం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కొమురవెల్లి మల్లన్న దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు ఆలయాని విచ్చేశారు. దీంతో స్వామి వారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్క్ ధరించకుంటే ఎవ్వరినీ…
కోడిపందాలు జూదం కాదు.. సంస్కృతిలో భాగమని వైసీపీ మంత్రి రంగనాథరాజు అన్నారు. ఆదివారం ఆయన ఏపీ ప్రజలందరికీ కనుమ పండుగ శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంస్కృతి, చట్టాలను రెండింటిని గౌరవించాలని, కోడి పందాలు సంప్రదాయంగా చట్టబద్ధంగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం పేదలకు ఇళ్లు, ఇళ్లస్థలాలు కేటాయిస్తోందిని, ఇళ్ల నిర్మాణానికి రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఓటీఎస్ ద్వారా యాజమాన్య హక్కులు అందిస్తున్నామని ఆయన తెలిపారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు…
సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో సికింద్రాబాద్ క్లబ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో క్లబ్ మొత్తం మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులుకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించి మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. క్లబ్‌లో అగ్నిప్రమాదం…
తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో నేడు ప్రభల ఉత్సవం ఎంతో వైభవోపేతంగా నిర్వహించనున్నారు. సంక్రాంతి సమయంలో కోనసీమ వీధుల్లో నడయాడుతున్న ఇంద్రధస్సులా తీర్థాలకు వెళ్లే రంగురంగుల ప్రభలు సీమ అందాలను రెట్టింపు చేస్తాయంటే అతిశయోక్తి కాదు. కోనసీమలో జరిగే ప్రభల తీర్థాలకు వందల ఏళ్ల పురాణ చరిత్ర ఉంది. పెద్ద పండగ నాడు మొదలై… ముక్కనుమ, ఆ తరువాత రోజు వరకు కోనసీమ నలుమూలల సుమారు 90 వరకు ప్రభల తీర్థాలు జరుగుతాయి. కనుమ పండుగ రోజున ప్రభల…
పసిఫిక్ ద్వీపకల్పం టోంగాలో అగ్నిపర్వతం బద్దలైంది. సముద్రం అడుగున ఉన్న భారీ అగ్నిపర్వతం పేలింది. దీంతో హవాయి, అలస్కా, యూఎస్ పసిఫిక్ కోస్ట్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అగ్ని పర్వతం విస్ఫోటనం తర్వాత భారీగా పొగ, బూడిద ఎగిసిపడుతోంది. టోంగా రాజధాని నుకులోఫాలో 12 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ తీరానికి అమెరికా వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. సునామీ హెచ్చరికల దృష్ట్యా యూఎస్ పశ్చిమ తీరంలోని బీచ్‌లు…
తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు జీవో 317ను రద్దు చేయాలని కోరుతూ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. తాజాగా ప్రగతి భవన్‌ను ముట్టడికి టీచర్స్ యత్నించారు. దీంతో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు 70 మందికి పైగా టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట నుంచి ప్రగతి భవన్ వరకు పోలీసులు మోహరించారు. వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలిస్తున్నారు. అసంబద్దంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టారని, సీనియార్టీ ప్రకారం…
సినీ, రాజకీయ కుటుంబాలతో అనుబంధం ఉన్న అశోక్ గల్లా హీరోగా అరంగేట్రం చేసిన సినిమా ‘హీరో’. ఇటు తాత కృష్ణ పేరు మోసిన స్టార్ హీరో, మేనమామ మహేశ్ బాబు ఈ నాటి మేటి హీరో. వీరి అండదండలతో పాటు, అటు తండ్రి గల్లా జయదేవ్, నాన్నమ్మ గల్లా అరుణకుమారి రాజకీయరంగంలో పేరొందినవారు. వీరి వారసుడు కాబట్టి అశోక్ గల్లా ‘హీరో’పై అందరి దృష్టి మళ్ళింది. అయితే సినిమా నిర్మాణంలో జరిగిన తీవ్ర జాప్యంతో దీనిపై జనాలకు…
ఈ రోజు ఉదయం 10.30 గంటలకు స్టార్టప్‌ల ప్రతినిధులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరు అంశాలపై స్టార్టప్ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. జనవరి 16ను జాతీయ అంకుర దినోత్సవంగా జరుపుకోవాలన్నారు. అంకుర సంస్థలు నవ భారతానికి వెన్నెముకగా మారనున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశంలో కోసం ఆవిష్కరణలు చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా భారతదేశం నుంచి ఆవిష్కరణలు చేద్దామన్నారు. దేశంలోని ప్రతి జిల్లాలోనూ అంకుర…
ఏపీలో మరో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాలోని ఎస్సార్‌పురంలో గుర్తు తెలియని దుండగులు వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే ఘటనా స్థలం వద్దకు వైసీపీ కార్యకర్తలు చేరుకొని ధర్నా చేపట్టారు. అంతేకాకుండా ఘటనస్థలాన్ని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ.. పోలీసులు డిప్యూటీ సీఎం నారాయణస్వామి అగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విగ్రహ ధ్వంసానికి…
సంక్రాంతి సందర్భంగా రాజ్ భవన్లో మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై దంపతులు, బంధువులు, రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు. సంప్రదాయ పద్దతిలో రాజ్ భవన్లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పొంగల్ తయారు చేశారు. అనంతరం గవర్నర్ తమిళసై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా ప్రోటోకాల్‌ను పాటిస్తూ పండుగ జరుపుకుందామని ఆమె పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన జాగ్రత్తలు…