రాజేంద్రనగర్ హైదర్‌గూడ లోని ఇష్తా సిటీ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 521 ఫ్లాట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది చూసిన అపార్ట్‌మెంట్ వాసులు బయటకు పరుగులు పెట్టారు. మంటలు భారీగా మంటలు వ్యాప్తించి అగ్నికీలలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు.
అయితే ఇంట్లోని సామాగ్రి పూర్తి దగ్దమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం సంభవించినట్లు అనుమానం వ్యక్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సికింద్రాబాద్ క్లబ్‌లో ఈ రోజు వేకుకజామున 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. క్లబ్‌లోని ప్రధాన భవనం అగ్నికి అహుతైంది. క్లబ్‌లో చెలరేగిన మంటలను సుమారు 10 ఫైరింజన్‌ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు.