కరోనా రక్కసి ఎవ్వరినీ వదలడం లేదు. ఇప్పటికే కరోనా సోకి కోలుకున్న వారు సైతం కరోనా బారినపడుతున్నారు. ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత కరోనా కేసుల సంఖ్యం దేశవ్యాప్తంగా పెరుతూవస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్‌డౌన్‌లు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఈ నెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే తెలుగువారికి ప్రత్యేకమైన సంక్రాంతి పండుగను పురస్కరించికొని నైట్ కర్ఫ్యూను 18వ తేదీ నుంచి పెడుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మరోసారి కరోనా సోకింది. ఆయనకు ఇప్పటికే రెండు సార్లు కరోనా సోకింది. ఇప్పుడు తాజా మరోసారి కరోనా సోకడంతో క్వారంటైన్‌లో ఉన్నట్లు ఆయన సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించారు. అయితే ఆయన సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో, వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో వారితో సన్నిహితంగా ఉన్నవారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.