ప్రముఖ వ్యాపారవేత్త, వైసీపీ నేత పోట్లూరి వరప్రసాద్(పీవీపీ) పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నిన్న ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పీవిపీ అనుచరుడు బాలాజీ మరికొందరితో కలిసి డీకే అరుణ కుమార్తె శృతి రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి, ఆమె స్వంతగా నిర్మించుకున్న ప్రహరి గోడతో పాటు రేకులను సైతం జేసీబితో ధ్వంసం చేయించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా శృతిరెడ్డిని బెదిరింపులకు గురి చేసినట్టు తన ఫిర్యాదులో…
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను సంతృప్తి పరచాలేకానీ… బ్లాక్ మెయిల్ చేయడం తగదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. తిరుపతిలోని స్థానిక బైరాగి పట్టెడలో ఉన్న సీపీఐ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతం దాల్చుతున్న నేపథ్యంలో ఖమ్మం నందు ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ ఉద్యమ విరమణకు ప్రయత్నించగా తెలంగాణ ప్రజలు, ఊస్మానియా వర్శిటీ విద్యార్థులు తిరగబడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో…
తెలంగాణకే తలమానికమైన సమ్మక్క-సారక్క జాతర ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమ్మక్క-సారక్క జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలను నుంచి రోజుకు సుమారు 3 లక్షల మంది అమ్మవార్ల దర్శనం కోసం విచ్చేస్తారని అంచనా వేసినట్లు ఆమె పేర్కొన్నారు. భక్తుల ఆరోగ్య దృష్ట్యా జాతరలో మెడికల్…
కరోనా మహమ్మారి రోజురోజుకు మరింతగా విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వచ్చిన తరువాత మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు దేశవ్యాప్తంగా భారీగా నమోదవుతున్నాయి. అయితే కరోనా రక్కసి కొత్త కొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా సోకి ఇంటివద్దనే ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నవారి కోసం విలువైన సమచారాన్ని సోషల్‌మీడియా వేదికగా…
కరోనా మహమ్మారి తగ్గేదేలే అంటోంది. కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది కరోనా రక్కసి ప్రజలపై విరుచుకుపడుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభన ఇప్పటికే భారత్‌లో మొదలైంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల సంఖ్య భారీ పెరిగిపోయింది. రోజురోజుకు కరోనా కేసులు సంఖ్య భారీగా నమోదువుతోంది. అయితే బ్లాక్ ఫంగస్ కేసులు కూడా మళ్లీ వెలుగులోకి వస్తుండడం ఆందోళన కలిగించే విషయం. యూపీలో తొలి…
కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఎన్నో సినిమాల విడుదల వాయిదా పడింది. అయితే కరోనా విజృంభిస్తున్న కూడా.. సంక్రాంతి బరిలో అక్కినేని నాగార్జున, నాగచైతన్యలు నటించిన బంగార్రాజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సంపాందించుకుని సంక్రాంతి విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరంలో బంగార్రాజు సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్‌ల భేటీ గురించి…
వైసీపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త పోట్లూరి వరప్రసాద్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పీవిపీ అనుచరుడు బాలాజీ మరికొందరితో కలిసి డీకే అరుణ కుమార్తె శృతి రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి, ఆమె స్వంతగా నిర్మించుకున్న ప్రహరి గోడతో పాటు రేకులను సైతం జేసీబితో ధ్వంసం చేయించారు. అంతేకాకుండా శృతిరెడ్డిని బెదిరింపులకు గురి చేసినట్టు తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పీవిపీతోపాటు సంఘటన స్థలంలో ఉన్న బాలాజీ…
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలిపెట్టడం లేదు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లకు కరోనా సోకింది. దీంతో వారు ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. అయితే స్వల్ప లక్షణాలతో కరోనా సోకిందని చంద్రబాబు తెలిపారు. దీనిపై రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తూ.. చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ స్పందిస్తూ..…
కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. క్రమక్రమంగా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో కరోనా కేసులు అనుహ్యంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ దాని ప్రభావాన్ని చూపుతోంది. దీంతో దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూతో పాటు వీకెండ్ లాక్డౌన్ లాంటివి విధించి కరోనా కట్టడికి చర్యలు చేపట్టాయి. అయితే తెలంగాణలో సైతం కరోనా కోరలు చాస్తోంది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 2,983 కరోనా…
కరోనా వైరస్ విజృంభన కోనసాగుతూనే ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రాకముందు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇప్పుడు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలను కఠినతరం చేసింది. ఫస్ట్, సెకండ్ వేవ్‌లతోనే రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూసాయి. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారికి గతంలో 14 రోజులు సెలవులను ప్రకటించిన సింగరేణి సంస్థ.. ఇప్పుడు 7రోజులు మాత్రమే కరోనా సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కేంద్రం తాజాగా…