తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌లకు జనగామ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. తెలంగాణలోని పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తే.. మన దేశం అభివృద్ధిలో అమెరికాను దాటుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాల లాంటివి బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్నారా..? అని ఆయన ప్రశ్నించారు.…
నిశీది వేళలో సైతం నిద్రించని భాగ్యనగరం ఇప్పడు బోసిపోయింది. సంక్రాంతి పండుగ వేళ.. పట్నంవాసులు పల్లెలకు పరుగులు తీశారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు మహానగరంలో ఉరుకుల పరుగుల జీవితాన్ని గడిపి.. సంక్రాంతి పండుగకు సొంతూళ్లో బంధుమిత్రులతో గడిపేందుకు ప్రజలు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రధాన రహదారులు వెలవెలబోతున్నాయి. ఎప్పడూ రద్దీగా ఉండే రోడ్లన్నీ నిర్మానుష్యంగా తయారయ్యాయి. అటు ఏపీకి చెందిన వారు ఆంధ్రాకు పయనమైతే.. ఇటు తెలంగాణలోని వారి సైతం తమ ఊర్లకు…
కరోనా వైరస్ తగ్గెదేలే అనే విధంగా రోజురోజుకు పెరిగిపోతోంది. కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలను భయపడుతోన్న కరోనా రక్కసి.. ఒమిక్రాన్ వ్యాప్తి మరోసారి విజృంభిస్తోంది. కరోనా కేసులు దేశవ్యాప్తంగా భారీగా నమోదవుతున్న వేళ పలు రాష్ట్రాలు కరోనా నిబంధనలను కఠిన తరం చేశారు. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా 2,68,833 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో పాటు గడిచిన 24 గంటల్లో 1,22,684 మంది కరోనా నుంచి…
రవాణా శాఖ వారు సంక్రాంతి పండుగ వేళ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పండుగ వచ్చిదంటే ప్రైవేటు ట్రావెల్స్ టికెట్ ధరలకు రెక్కలు వస్తాయి. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. ఎన్నిసార్లు జరిమానాలు విధించినా వినకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. దీంతో రవాణాశాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ మూడో రోజు నిర్వహించారు. బెంగుళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రత్యేక దాడులు చేశారు.…
సంక్రాంతి పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగువారింట సంక్రాంతి పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి నేపథ్యంలో సంక్రాంతి పండుగను తెలుగువారు నామమాత్రంగానే జరుపుకున్నారు. అయితే మొన్నటి వరకు కరోనా రక్కసి తగ్గుముఖం పడుతుండడంతో ప్రజలు ఈ ఏడాది సంక్రాంతి సంబరాలపై ఆసక్తిగా ఉన్నారు. ఇదే సమయంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది. దీంతో మళ్లీ కరోనా కేసులు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే ఏపీలో సంక్రాంతి…
కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తితో కరోనా కేసులు మరింతగా పెరుగుతున్నాయి. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం కూడా ఈ నెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రకటించింది. అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆలయాల్లో ప్రతి ఏడాది నిర్వహిస్తున్న కొన్ని కార్యక్రమాలను సైతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడిస్తున్నారు.…
కరోనా మహమ్మారి గత రెండు సంవత్సరాలుగా భారత్‌తో పాటు యావత్తు ప్రపంచ దేశాలను సైతం పట్టిపీడిస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికా కూడా కరోనా వైరస్ ధాటికి తట్టుకోలేకపోయింది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత మళ్లీ పెరుగుతున్నాయి. భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ దాని ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా కేసులు మరోసారి పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ఈ నెల 18 నుంచి…
కష్టపడి సంపాదించి.. కొంచెకొంచెం కూడబెట్టుకొని భవిష్యత్ ప్రణాళికల కోసం పోగు చేసుకుంటున్న డబ్బులను గద్ద వచ్చి పామును తన్నుకుపోయిన విధంగా చిట్టీల పేరుతో లూటీ చేస్తున్నారు కొందరు. ఇలాంటి ఘటనే విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఎలియాబాబు అలియాస్ రవి అనే వ్యక్తి పప్పుల చిట్టీల పేరుతో చిట్టీ వ్యాపారం మొదలుపెట్టారు. అయితే తనను నమ్మి ఎంతో మంది ఖాతాదారులు, ఏజెంట్లు రవి దగ్గర చిట్టీలు వేయడం మొదలు పెట్టారు. ఖాతాదారులకు, ఏజెంట్లను నమ్మకం కుదిరేంతవరకు మంచిగా నటించిన…
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక నుంచి ఒడిశా వరకు ఉపితల ఆవర్తనం వ్యాపించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికీ నిన్న…
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగను తెలుగురాష్ట్రాల్లో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ వచ్చిదంటే చాలు.. ఘుమఘుమలాడే పిండివంటలు, పిల్లల ఆటపాట, గాలిపటాల హుషారుతో ఇళ్లంతా కోలాహలంగా మారిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తెలుగింటి లోగిళ్లు రంగవల్లులతో దర్శనమిస్తున్నాయి. ఉదయాన్నే లేచేసరికి చలిగాలి పలకరింపుతో పులకరించి, పుణ్యస్నానాలచరించి కొత్తబట్టలు వేసుకొని చిన్నాపెద్దా తేడాలేకుండా హుషారుగా…