టాలీవుడ్ స్టార్ హీరో మహేష్‌బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ నుంచి వస్తున్న మూవీ ఇదే. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కళావతి పాట యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఇప్పుడు తాజాగా రెండో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పెన్నీ అంటూ సాగే లిరికల్ పాట విడుదలైన కాసేపటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ పాటలో మహేష్ కుమార్తె సితార చాలా బాగా డ్యాన్స్ చేసింది. సితార డ్యాన్స్ చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదని ప్రిన్స్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అటు మహేష్ కూడా ఈ పాటలో చాలా క్యూట్‌గా కనిపిస్తున్నాడు. అతడి డ్యాన్స్ కూడా అభిమానులను అలరిస్తోంది. పెన్నీ సాంగ్‌లో మహేష్ కళ్లజోడు పెట్టుకుని మెరిసిపోతున్నాడు. గీతగోవిందం ఫేం పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ పాట ఈరోజు ఉదయమే ఓ మ్యూజిక్ యాప్‌లో లీక్ కాగా సినిమా యూనిట్ అప్రమత్తమై.. సదరు యాప్ నుంచి పాటను తొలగించేలా చర్యలు తీసుకుంది. కాగా మే 12న సర్కారు వారి పాట మూవీ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.