బ్రహ్మానందం బర్త్ డే సందర్భంగా ‘పంచతంత్రం’ టీజర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. ఫిబ్రవరి 1 బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన క్యారెక్టర్ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో వేదవ్యాస్ పాత్రలో బ్రహ్మానందం నటిస్తున్నట్టు దర్శకులు హర్ష పులిపాక తెలిపారు. ఆలిండియా రేడియోలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి వేదవ్యాస్. ఆయన కుమార్తె పాత్రను స్వాతి రెడ్డి చేశారు.

‘జర్నీ ఆఫ్ వ్యాస్’ పేరుతో విడుదల చేసిన టీజర్‌లో అరవైయేళ్ల వయసులో కథల పోటీల్లో పాల్గొనడానికి వెళ్లిన వ్యక్తిగా బ్రహ్మానందాన్ని చూపించారు. ‘ఏమ్మా… కెరీర్ అంటే ఇరవైల్లోనే మొదలు పెట్టాలా? అరవైల్లో మొదలు పెట్టకూడదా?’ అని బ్రహ్మానందం చెప్పే డైలాగ్ చాలామందికి కనెక్ట్ అయ్యేలా ఉంది. నిర్మాతలు సృజన్ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ “బ్రహ్మానందం గారు ఎన్నో పాత్రల్లో మనల్ని నవ్వించారు. ఆయనలో వినోదం మాటున అద్భుతమైన నటుడు ఉన్నారు. మా సినిమాలో నటుడిగా ఆయన కొత్త పాత్రలో కనిపిస్తారు. వెయ్యి చిత్రాలకు పైగా చేసిన బ్రహ్మానందం గారు, మా సినిమాలో నటించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీ, ఇతర వివరాలు వెల్లడిస్తాం” అని అన్నారు.
Also Read
- Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
తాజావార్తలు
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
-
OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..