శర్వానంద్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ సినిమా ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. దీనికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఈ నెల 25న విడుదల కాబోతోంది. దాంతో 4వ తేదీ నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు కాబోతున్నాయి. ఫిబ్రవరి 4న టైటిల్ సాంగ్ (ఆడవాళ్లు మీకు జోహార్లు)ను రిలీజ్ చేయబోతున్నారు. ఆ రోజు సాయంత్రం 4:05 గంటలకు ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేస్తారు. ఈ మేరకు ఓ నయా పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు..