‘అమ్మాయి బాగుంది’, ‘గుడుంబా శంకర్’, ‘భద్ర’, ‘పందెం కోడి’, ‘మహారథి’, ‘గోరింటాకు’ వంటి చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు సంపాందించింది నటి మీరా జాస్మిన్. తన నటనతో మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలను పోషించింది. అయితే తెలుగులో ఆమె చివరి చిత్రం 2013లో వచ్చిన ‘మోక్ష’. ఆ తర్వాత తమిళ, మలయాళ సినిమాలలో నటించినా అంత యాక్టివ్ గా అయితే లేదు. జాతీయ అవార్డు కూడా గెలుచుకున్న మీరా జాస్మిన్ అంటే సినిమా…
సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది’. టీజీ కీర్తి కుమార్ దీనికి దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకం మీద రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను ‘జీ 5’ ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేయనుంది. ఫిబ్రవరిలో సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథాంశంతో రూపొందిన సినిమా ‘మళ్ళీ…
తెలుగు చిత్రసీమలో పలు చెరిగిపోని తరిగిపోని రికార్డులు నెలకొల్పిన ఘనత అన్న నందమూరి తారక రామారావుకే దక్కుతుంది. తెలుగునాట తొలిసారి నేరుగా ద్విశతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా పాతాళభైరవి (1951) నిలచింది. తరువాత తొలి తెలుగు స్వర్ణోత్సవ చిత్రంగానూ పాతాళభైరవి నిలచింది. ఆ పై మొట్టమొదటి వజ్రోత్సవ చిత్రం (60 వారాలు)గా లవకుశ (1963) నిలచింది. ఆ పై నేరుగా మూడు వంద రోజులు ఆడిన సినిమాగా అడవిరాముడు (1977) వెలిగింది. సాంఘికాలలోనూ వజ్రోత్సవ చిత్రంగా వేటగాడు (1979)…
రెండు రోజుల క్రితమే అమూల్ సంస్థ ‘పుష్ఫ’ మూవీ హీరో పాత్రను ఉపయోగిస్తూ, ఓ వాణిజ్య ప్రకటనను విడుదల చేసింది. దేశంలో కాస్తంత సంచలనం సృష్టించిన అంశాలు కనిపిస్తే చాలు వాటిని ప్రకటనలుగా మార్చి, దేశ వాప్తంగా హోర్డింగ్స్ లో పెట్టడం అమూల్ సంస్థకు కొత్తకాదు. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం ‘పుష్ప’ను కరోనా అవేర్ నెస్ కార్యక్రమాలకు ఉపయోగించేస్తోంది. అందులోని ‘తగ్గేదేలే’ డైలాగ్ కు వచ్చిన పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని, ఈ రకంగా…
గత యేడాది టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కొత్త కథానాయికలలో వరుస విజయాలతోనే కాదు అవకాశాలతోనూ అగ్రస్థానంలో నిలిచింది శాండిల్ వుడ్ బ్యూటీ కృతీశెట్టి. ‘ఉప్పెన’తో తొలి విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు తొలి సంవత్సరమే ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో మలి విజయాన్ని అందుకుంది. ఇక కొత్త సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన ‘బంగార్రాజు’తో హ్యాట్రిక్ ను అందుకుంది. చిత్రం ఏమంటే ఆమె నటించిన మరో మూడు చిత్రాలు ప్రస్తుతం సెట్స్ పై వివిధ దశల్లో ఉన్నాయి. అందులో…
హీరోగా ఆశిష్‌కు ‘రౌడీబాయ్స్’ సినిమాతో శుభారంభం దక్కడం ఆనందంగా ఉందంటున్నారు నిర్మాత దిల్ రాజు. యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ లో చక్కటి పరిణతి కనబరచిన ఆశిష్ ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడా అందర్ని ఆకట్టుకున్నాడని చెబుతుంతే చాలా సంతోషంగా ఉంది అంటున్నారు దిల్‌రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి ఆయన నిర్మించిన తాజా చిత్రం రౌడీబాయ్స్. ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ ఇందులో జంటగా నటించారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా ఈ…
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలలో నటించిన అందాల భామ త్రిష… మల్లూవుడ్ లోకి మాత్రం ఆలస్యంగా అడుగుపెట్టింది. ఆమె నటించిన మొదటి మలయాళ చిత్రం ‘హే జూడ్’ 2018 ఫిబ్రవరి 2న విడుదలైంది. శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష సరసన ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పౌల్ హీరోగా నటించాడు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి అప్పట్లో మంచి ఆదరణ లభించింది. సినిమా ప్రారంభమయ్యేది కొచ్చిలోనే అయినా ఆ తర్వాత…
సంక్రాంతికి విడుదలైన ‘రౌడీ బాయ్స్’ డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది. దీనికి కారణం అనుపమ పరమేశ్వరన్. ఈ మలయాళ బ్యూటీ ఈ సిమాలో లిప్ లాక్స్ తో చెలరేగింది. ప్రస్తుతం ఈ లిప్-లాక్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకూ ఇంతలా రెచ్చిపోని ఈ బ్యూటీ ఇప్పుడు హద్దులు దాటి కొత్త హీరోతో రొమాంటిక్ సీక్వెన్స్‌లో రెచ్చిపోవడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అయితే దీనికోసం అనుపమ భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. కొత్తహీరోతో జతకట్టడంతో పాటు…
థమన్, మిక్కీ జె మేయర్ లాంటి స్వరకర్తలు పోటీ ఇస్తున్నా దేవి శ్రీ ప్రసాద్ తన పొజిషన్ ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. దానికి నిదర్శనమే ‘పుష్ప’. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ‘పుష్ప’ విజయంలో దేవిశ్రీకి కూడా భాగం ఉందని చెప్పక తప్పదు. ఈ సినిమాలోని అన్ని పాటలు టాప్ 100 యూట్యూబ్ గ్లోబల్ మ్యూజిక్ వీడియో చార్ట్ లలో చోటు దక్కించుకున్నాయి. దాంతో బాలీవుడ్ బిగ్గీస్ కన్ను ఈ సూపర్ టాలెంటెడ్ కంపోజర్ పై…
అభిరామ్ వర్మ, శ్వేతావర్మ, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘ఏకమ్’. గత యేడాది అక్టోబర్ 29న విడుదలైన ఈ చిత్రాన్ని వరుణ్ వంశీ దర్శకత్వంలో ఎ. కళ్యాణ్ శాస్త్రి, పూజ ఎం, శ్రీరామ్ కె సంయుక్తంగా నిర్మించారు. పంచ భూతాల నేపథ్యంలో తాత్విక చింతనకు ఆధునికత జోడించి తెరకెక్కిన ‘ఏకమ్’ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. విశేషం ఏమంటే.. ప్రస్తుతం…