సౌతిండియన్ స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య విడాకుల వ్యవహారం గురించిన చర్చ జోరుగా సాగుతుండగానే… జాతీయ మీడియాలో ఇప్పుడు మరో డైవర్స్ ఇష్యూ హల్చల్ చేస్తోంది. ‘మహాభారత్’ టెలివిజన్ సీరియల్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రీకృష్ణ పాత్రధారి నితీశ్ భరద్వాజ్ సైతం పన్నెండేళ్ళ తర్వాత తన భార్య స్మిత ఘటె కు విడాకులు ఇస్తున్నాడు. 2019 సెప్టెంబర్ నుండి నితిష్ – స్మిత విడివిడిగా ఉంటున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ అయిన స్మిత…
రెండు రోజుల క్రితం అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘బచ్చన్ పాండే’ మూవీ సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఆ చేదు ఘటన నుండి వెంటనే బయటకు వచ్చిన ఈ చిత్ర బృందం ఇప్పుడీ సినిమాను హోలీ కానుకగా మార్చి 18న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు తెలిపింది. మూవీ హీరో అక్షయ్ కుమార్ ఈ విషయాన్ని తెలియచేస్తూ, నయా పోస్టర్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. కరోనా కరణంగా…
రవితేజ కథానాయకుడిగా సత్యనారాయణ కోనేరు ‘ఖిలాడి’ సినిమాను నిర్మించాడు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, గతేడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగులో విషయంలో జాప్యం జరిగింది. ఈ సంక్రాంతికి ఈ సినిమా వస్తుందేమోనని కూడా అనుకున్నారు. కానీ ఫిబ్రవరి 11వ తేదీని ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఐరన్ రాడ్ పట్టుకుని యాక్షన్ మోడ్‌లోకి దిగిపోయినట్టు…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా RRR రిలీజ్ పోస్ట్ పోన్ పై హీరో రామ్ చరణ్ స్పందించారు. రౌడీ బాయ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న రాంచరణ్ ఆర్.ఆర్.ఆర్ విడుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి మాకు ఎంత ముఖ్యమో మాకు తెలియదు కానీ…
‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్రా శుక్లా కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘ఉనికి’. రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వంలో బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి దీనిని నిర్మించారు. తొలుత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఈ సినిమాను దర్శక నిర్మాతలు విడుదల చేయాలని భావించారు. అయితే సంక్రాంతి బరి నుండి పెద్ద చిత్రాలు ‘ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్’ తప్పుకోవడంతో ఆ సీజన్ ను ఉపయోగించుకోవాలనే ఆశతో సినిమా విడుదల తేదీని 15వ తేదీకి…
సంక్రాంతికి కొత్త సినిమాలు సందడి చేస్తాయని తెలుగు ప్రేక్షకులు ఆశించారు. కానీ కరోనా ఆ అవకాశం ఇవ్వలేదు. ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ విడుదల వాయిదా పడింది. ఇక, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ ఇండస్ట్రీకి మరో దెబ్బ. ఇబ్బందనిపిస్తే విడుదల వాయిదా వేసుకోవచ్చని మంత్రి గారే స్వయంగా సెలవిచ్చారు. టికెట్ల ధరలపై దర్శకుడు ఆర్జీవీతో సమావేశం తరువాత మంత్రి పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, టికెట్ల ధరల వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన కమిటీ…
నాటి మేటి నటులలో తన బహుముఖ ప్రజ్ఞతోనూ, బహు భాషాపాండిత్యంతోనూ ఆకట్టుకున్న అరుదైన నటులు కొంగర జగ్గయ్య. ఆయన పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన కంచుకంఠం. ఎంతటి సుదీర్ఘ సమాసాలనైనా అలవోకగా చెప్పగల నేర్పు, ఓర్పు జగ్గయ్య గళం సొంతం. చిత్రసీమలో అడుగు పెట్టకముందు తన విద్యను ప్రదర్శించుకోవడానికి అన్నట్టు జగ్గయ్య బహుకృత వేషం కట్టారు. అందులో పాత్రికేయ వృత్తిలోనూ రాణించారు. రేడియోలో వార్తలూ చదివారు. ఆ రోజుల్లో జగ్గయ్య వార్తలు చదువుతున్నారంటే…
సాధారణ హీరోకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టే సత్తా ఉన్న దర్శకుడు రాజమౌళి. ఆయన ఇప్పటివరకు 11 సినిమాలు చేయగా అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలను తెరకెక్కించి తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవల్లో నిలబెట్టాడు. ఇప్పుడు 12వ సినిమాగా మల్టీస్టారర్ సినిమాను రూపొందించాడు. ఆ సినిమానే ఆర్.ఆర్.ఆర్. రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ మూవీ…
పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’. మలయాళం సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు ఈ సినిమా రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం పవర్‌స్టార్ అభిమానులే కాదు రానా అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం హీరో రానా పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. Read Also: ఫ్యాన్స్ రచ్చపై స్పందించిన ఐకాన్ స్టార్.. ఎప్పుడూ మర్చిపోను..! రానా బర్త్‌డే కానుకగా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, వెంకీ కుడుముల, మారుతి, బుచ్చిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ… ప్రతి డైరెక్టర్ పనిచేయాలనుకునే హీరో బన్నీ అని తెలిపాడు. పుష్పరాజ్‌గా బన్నీ నటన ఈ సినిమాలో వేరే లెవల్లో ఉండబోతుందని చెప్పాడు. సుకుమార్ గురించి చెప్పాలంటే ఆయన ఓ లెక్కల…