త్రిష తొలి మలయాళ చిత్రం ‘ఆహా’లో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలలో నటించిన అందాల భామ త్రిష… మల్లూవుడ్ లోకి మాత్రం ఆలస్యంగా అడుగుపెట్టింది. ఆమె నటించిన మొదటి మలయాళ చిత్రం ‘హే జూడ్’ 2018 ఫిబ్రవరి 2న విడుదలైంది. శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష సరసన ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పౌల్ హీరోగా నటించాడు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి అప్పట్లో మంచి ఆదరణ లభించింది. సినిమా ప్రారంభమయ్యేది కొచ్చిలోనే అయినా ఆ తర్వాత కథ గోవాకు మారుతుంది. హీరో జూడ్ కొచ్చి నుండి తన తండ్రితో కలిసి అనుకోకుండా వచ్చిన ఓ ఆస్తిని పొందడానికి గోవాకు వెళ్ళడం, అక్కడ హీరోయిన్ క్రిస్టల్ తో పరిచయం కావడం… ఆ పరిచయం ఎలా ప్రేమగా మారిందన్నదే ఈ చిత్ర కథ.
ఇందులో నివిన్ పౌల్ బుద్ధిమాద్యం ఉన్న యువకుడిగా నటించాడు. మేథస్సులో అతనికి తిరుగులేకపోయినా, వ్యవహారిక విషయాలలో తన వయసుకు తగ్గ పరిపక్వత లేని యువకుడి పాత్రను పోషించాడు. ఆ కారణంగా అతనికి సమాజం నుండి, తోటి వ్యక్తుల నుండి రకరకాల సమస్యలు ఎదురవుతాయి, అతను వాటిని ఎలా అధిగమిస్తూ ముందుకు సాగాడన్నదే సినిమా. సిద్ధిక్, నీనా కురూప్, విజయ్ మీనన్, అపూర్వ బోస్, అజూ వర్గీస్ ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలోని నాలుగు పాటలకు నలుగురు సంగీత దర్శకులు స్వరాలు సమకూర్చడం విశేషం. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ ‘ఆహా’లో జనవరి 21 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది.
Also Read
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!