అప్పట్లో యన్టీఆర్… ఇప్పుడు బాలకృష్ణ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో పలు చెరిగిపోని తరిగిపోని రికార్డులు నెలకొల్పిన ఘనత అన్న నందమూరి తారక రామారావుకే దక్కుతుంది. తెలుగునాట తొలిసారి నేరుగా ద్విశతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా పాతాళభైరవి (1951) నిలచింది. తరువాత తొలి తెలుగు స్వర్ణోత్సవ చిత్రంగానూ పాతాళభైరవి నిలచింది. ఆ పై మొట్టమొదటి వజ్రోత్సవ చిత్రం (60 వారాలు)గా లవకుశ (1963) నిలచింది. ఆ పై నేరుగా మూడు వంద రోజులు ఆడిన సినిమాగా అడవిరాముడు (1977) వెలిగింది. సాంఘికాలలోనూ వజ్రోత్సవ చిత్రంగా వేటగాడు (1979) చరిత్ర కెక్కింది. అప్పట్లో తెలుగునాట అత్యధిక స్వర్ణోత్సవాల కథానాయకునిగా పాతాళభైరవి, లవకుశ, అడవిరాముడు, వేటగాడు, బొబ్బిలిపులి రామారావు చరిత్ర సృష్టించారు. ఇక నేరుగా స్వర్ణోత్సవం చూసిన తొలి చిత్రంగా ఏయన్నార్ ప్రేమాభిషేకం నిలచింది. అలాగే తెలుగునాట తొలి ప్లాటినమ్ జూబ్లీ (75 వారాలు) చిత్రంగానూ ప్రేమాభిషేకం నిలచింది.
యన్టీఆర్ తరువాత తెలుగునాట అత్యధిక స్వర్ణోత్సవాలు కలిగిన ఏకైక నటునిగా ఆయన నటవారసుడు బాలకృష్ణ చరిత్ర సృష్టించారు. మంగమ్మగారి మనవడు, ముద్దుల క్రిష్ణయ్య, ముద్దుల మావయ్య, సమరసింహారెడ్డి, లెజెండ్ చిత్రాలు స్వర్ణోత్సవాలు చూశాయి. వీటిలో మంగమ్మగారి మనవడు, లెజెండ్ చిత్రాలు వరుసగా 565 రోజులు, 1005రోజులు ఆడి అరుదైన రికార్డు నెలకొల్పాయి. నేటికీ తెలంగాణలో అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా మంగమ్మగారి మనవడు హైదరాబాద్ లో 565 రోజులతో రికార్డుగా నిలచింది. ఇక ఆంధ్ర, తెలంగాణ రెండు స్టేట్స్ లోనూ లెజెండ్ లాగా 1005 రోజులు ఆడిన సినిమా మరొకటి లేదు. ఆ మాట కొస్తే సౌత్ ఇండియాలోనే అత్యధిక రోజులు ఆడిన చిత్రంగా లెజెండ్ చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా గమనించదగ్గ అంశమేమంటే, యన్టీఆర్, బాలకృష్ణ రికార్డులు నెలకొల్పినవేవీ వారి సొంత చిత్రాలు కానీ, సొంత పంపిణీ సంస్థల్లో కానీ ఆడినవి కావు!
Also Read
- Home Gardening: ఖరీదైన కుండీలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోని ఈ 6 పాత వస్తువులతో మొక్కలు పెంచేయండి!
- Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
- లవ్ ఎమోషనల్ రైడ్ గా ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’
- Toxic Fan Culture: అభిమానమా? ఉన్మాదమా? ఉ*గ్రవాదమా? ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తారా?
ఇక అప్పట్లో 5 ఆటలతో వంద రోజులు ఆడిన చిత్రంగా అడవిరాముడు నెల్లూరు కనకమహల్ లో రికార్డు నెలకొల్పింది. ఆ తరువాత పదేండ్లకుకానీ, ఆ రికార్డును క్రాస్ చేయలేక పోయారు. అలా 5 ఆటలకు క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత యన్టీఆర్ సొంతం. ఇక నాలుగు ఆటలతో వంద రోజులకు క్రేజ్ ను తీసుకు వచ్చిన చిత్రాలు యన్టీఆర్ నటించిన కొండవీటి సింహం, బొబ్బిలిపులి. కాగా అసలు 28 కేంద్రాలలో 4 ఆటలతో వంద రోజులు ఆడి మొన్నటి దాకా జనంకోరుకుంటున్న నాలుగు ఆటల క్రేజ్ కు శ్రీకారం చుట్టిన ఘనత బాలకృష్ణ ముద్దుల మావయ్యతోమొదలయింది. సిల్వర్ జూబ్లీస్ లో ప్రేమాభిషేకం 18 కేంద్రాలలో రెగ్యులర్ షోస్ (3 ఆటలే) తో రికార్డు ఉండగా, దానిని పెళ్ళిసందడి 23 కేంద్రాలలో 4 ఆటలతో రజతోత్సవం దాటింది. ఆ తరువాత ఏ స్టార్ హీరో సినిమా కూడా పెళ్ళిసందడిని క్రాస్ చేయలేక పోయింది. ఆ నేపథ్యంలో బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి 30 కేంద్రాలలో 4 ఆటలతో 175 రోజులు ప్రదర్శితమై, రజతోత్సవాలకు ఓ క్రేజ్ సంపాదించిపెట్టింది. ఆ తరువాతే స్టార్ హీరోస్ లో చిరంజీవి, మహేశ్ బాబు, జూనియర్ యన్టీఆర్ వంటి వారు సిల్వర్ జూబ్లీస్ లో రికార్డులు చూశారు. ఇప్పుడు ఈ ప్యాండమిక్ లో ఓ సినిమా డైరెక్ట్ గా 50 రోజులు ఆడడమే గగనమైన పరిస్థితుల్లో అఖండ ఏకంగా 28 కేంద్రాలలో 4 ఆటలతో అర్ధ శతదినోత్సవం పూర్తి చేసుకొని రన్నింగ్ పరంగా మళ్ళీ అందరిలోనూ విశ్వాసం నెలకొల్పింది. ఈ ప్యాండమిక్ లోనూ కర్నూలు, వైజాగ్, గుంటూరు వంటి కేంద్రాలలో రెండు థియేటర్లలో అఖండ యాభై రోజులు ఆడడం నిజంగా ఓ రికార్డ్! ఇలా కూడా మళ్ళీ రన్నింగ్ లో రికార్డులకు తెర తీసిన ఘనత బాలయ్యకే దక్కుతుందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు.
తాజావార్తలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!