మేకోవర్ తో ఆకట్టుకుంటున్న మీరా జాస్మిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అమ్మాయి బాగుంది’, ‘గుడుంబా శంకర్’, ‘భద్ర’, ‘పందెం కోడి’, ‘మహారథి’, ‘గోరింటాకు’ వంటి చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు సంపాందించింది నటి మీరా జాస్మిన్. తన నటనతో మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలను పోషించింది. అయితే తెలుగులో ఆమె చివరి చిత్రం 2013లో వచ్చిన ‘మోక్ష’. ఆ తర్వాత తమిళ, మలయాళ సినిమాలలో నటించినా అంత యాక్టివ్ గా అయితే లేదు.
జాతీయ అవార్డు కూడా గెలుచుకున్న మీరా జాస్మిన్ అంటే సినిమా ప్రేక్షకులకు ఇప్పటికీ ఇష్టమే. మీరా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేసింది. తొలి పోస్ట్ లో దర్శకుడు సత్యన్ అంతికాడ్ తో కలసి చేయబోతున్న మలయాళ చిత్రం ‘మకల్’ నుండి స్టిల్‌ను పోస్ట్ చేసింది. ఇక ఇన్ స్టాలో మీరా మేకోవర్ ను చూసిన వారికి మళ్ళీ పూర్తి స్థాయిలో నటిగా ఫోకస్ పెట్టబోతోందనే విషయం అర్థం అవుతోంది. అంతే కాదు తను రీ-ఎంట్రీ స్టెప్ తీసుకుంటున్నందుకు ఆనందంగా ఉందని చెబుతోంది. ఇన్ స్టాలో మీరాని చూస్తే మళ్ళీ బిజీ అవటం ఖాయం అనే అనిపిస్తుంది. మరి తెలుగులో ముందుగా ఎవరు మీరా జాస్మిన్ కి అవకావం ఇస్తారో చూద్దాం.
Also Read
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?