థమన్, మిక్కీ జె మేయర్ లాంటి స్వరకర్తలు పోటీ ఇస్తున్నా దేవి శ్రీ ప్రసాద్ తన పొజిషన్ ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. దానికి నిదర్శనమే ‘పుష్ప’. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ‘పుష్ప’ విజయంలో దేవిశ్రీకి కూడా భాగం ఉందని చెప్పక తప్పదు. ఈ సినిమాలోని అన్ని పాటలు టాప్ 100 యూట్యూబ్ గ్లోబల్ మ్యూజిక్ వీడియో చార్ట్ లలో చోటు దక్కించుకున్నాయి. దాంతో బాలీవుడ్ బిగ్గీస్ కన్ను ఈ సూపర్ టాలెంటెడ్ కంపోజర్ పై పడింది. గతంలో దేవి కంపోజ్ చేసిన తెలుగు ట్యూన్‌లను బాలీవుడ్‌లో రీమేక్ చేసి హిట్ కొట్టారు. అయితే డైరెక్టర్ గా ఏ బాలీవుడ్ సినిమాకు దేవి సంగీతాన్ని అందించలేదు. ‘పుష్ప’ ప్రచారంలో ఇదే విషయం ప్రస్తావనకు వచ్చింది. తను సినిమాకు సోలోగా పాటలు అందించటానికి ఇష్టడతానని దేవి చెప్పాడు.
ఇదిలా ఉంటే దేవిశ్రీ నిరీక్షణ ఫలించే రోజు దగ్గరపడినట్లు తెలుస్తోంది. టీసిరీస్ అధినేత భూషణ్ కుమార్ తో డియస్పి మీట్ అయ్యాడు. వీరి మీటింగ్ లో త్వరలో టీసిరీస్ నిర్మించే సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించటానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మేకర్స్ పాటలకు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి వేర వేరు సంగీత దర్శకులతో పని చేయించుకోవడం ఆనవాయితీగా చేశారు. దీనిపై దేవిశ్రీతో పాటు థమన్ కూడా తమ అసంతృప్తిని వెళ్ళగక్కారు. మరి టీసీరీస్ సినిమాకు దేవిశ్రీ పాటల వరకే పరిమితం అవుతాడా? లేక మొత్తంగా సంగీతాన్ని అందిస్తాడా అన్నది చూడాలి.