American Express Credit Cards: కొత్త క్రెడిట్ కార్డులను జారీచేయకుండా అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్‌పై విధించిన నిషేధాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎత్తివేసింది. లోకల్ డేటా స్టోరేజ్ రూల్స్ పాటించట్లేదనే కారణంతో 2021 ఏప్రిల్‌లో నిషేధం విధించిన ఆర్బీఐ 15 నెలల అనంతరం నిన్న అనుమతించింది.
Investment-Profit: జెన్‌సోల్ ఇంజనీరింగ్ కంపెనీ షేర్ల విలువ ఆకాశమే హద్దుగా ఏడాదిలోనే 2,600 శాతం పెరిగింది. సంవత్సరం కిందట పెట్టిన 10 వేల రూపాయల పెట్టుబడి ఇప్పుడు ఏకంగా 2.77 లక్షలకు పెరిగింది. అహ్మదాబాద్‌కి చెందిన ఈ రెనివబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్.. ఐదారు లక్షలకే ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తేనుంది.
IT Slow Growth: మన దేశం చేస్తున్న ఏకైక అతిపెద్ద ఎగుమతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సర్వీసులు. విదేశీ మారకానికి కూడా ఇదే కీలకమైన సోర్స్. కానీ ఐటీ ఇండస్ట్రీ ఈ మధ్య ఆశించిన ఫలితాలను సాధించలేకపోతోంది. దీంతో ఆదాయం క్రమంగా తగ్గిపోతోంది.
One Man Two Jobs: ఒక ఉద్యోగి రెండు సంస్థల్లో పనిచేయటం సరికాదని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ పేర్కొన్నారు. అది మోసంతో సమానమని అభిప్రాయపడ్డారు. మూన్‌లైటింగ్‌గా పేర్కొనే ఈ పథకానికి ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఇటీవల అనుమతించిన సంగతి తెలిసిందే.
IRCTC Fund raising: ఇండియన్ రైల్వేస్‌కి టికెట్ బుకింగ్ సర్వీస్ అందిస్తున్న ఐఆర్‌సీటీసీ.. ప్రయాణికుల సమాచారంతో వెయ్యి కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు కన్సల్టెంట్‌ని ఎంపిక చేసేందుకు టెండర్లు ఆహ్వానించింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీలతో నిర్వహించే
'Aha' Decision: తెలుగు, తమిళ కంటెంట్ ప్రొవైడర్ అయిన 'ఆహా' ఓటీటీ.. ఆదాయం కోసం నెట్‌ఫ్లిక్స్ బాటలో పయనిస్తోంది. చిన్న పట్టణాల నుంచి కూడా సబ్‌స్క్రైబర్లను ఆకర్షించడంతోపాటు యాడ్స్‌తో కూడిన వీడియోలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హైబ్రిడ్ మోడల్‌కి మారుతోంది.
Mahatma Gandhi NREGS: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జులై నెలలో వర్క్ జనరేషన్ 50 శాతం పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మరియు వ్యవసాయేతర కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతుండటంతో కార్మికులు వాటి ద్వారా ఉపాధి పొందుతున్నారు.
RBI Update: కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెంట్రల్ బోర్డుకి నలుగురు స్వతంత్ర డైరెక్టర్లను మళ్లీ నామినేట్ చేసింది. సతీష్ కాశీనాథ్ మరాఠే, స్వామినాథన్ గురుమూర్తి, రేవతి అయ్యర్, సచిన్ చతుర్వేది.. పార్ట్ టైమ్, నాన్ అఫిషియల్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు.