BYJU’s: ఎవరినీ కాపీ కొట్టకుండా మన స్టైల్లో కొత్త కంపెనీని ప్రారంభించి, విజయవంతంగా వృద్ధిలోకి తీసుకురావటం అంత ఈజీ కాదని బైజూస్ కో-ఫౌండర్ దివ్యా గోకుల్‌నాథ్ అన్నారు. ఎడ్‌టెక్ సంస్థలకు ఈమధ్య ఎదురవుతున్న సవాళ్ల గురించి అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం చెప్పారు. బైజూస్ ప్రారంభమైనప్పుడు అది కేవలం ఒక యాప్ మాత్రమేనని, ఇప్పుడు అనూహ్యంగా విస్తరించిందని చెప్పారు.
Gautam Thapar: ‘అవంత’ గ్రూప్ ప్రమోటర్ మరియు సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ మాజీ చైర్మన్ గౌతమ్ థాపర్‌కి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 10 కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది. సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ నుంచి నిధులను దారిమళ్లించారనే ఆరోపణలకు సంబంధించిన కేసులో తుది ఆదేశాలను జారీ చేసింది.
Dr.Reddy’s-LIC: ప్రముఖ ఫార్మాస్యుటికల్ సంస్థ డాక్టర్ రెడ్డీస్‌లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాటా పెరిగింది. గత మూడు నెలల కాలంలో ఓపెన్ మార్కెట్‌లో 33 పాయింట్ ఎనిమిది ఆరు లక్షల షేర్లను కొనుగోలు చేయటంతో ఎల్‌ఐసీ షేరు 7 పాయింట్ 7 శాతానికి చేరింది. గతంలో డాక్టర్ రెడ్డీస్‌లో ఎల్‌ఐసీ షేరు 5 పాయింట్ ఆరు ఐదు శాతం మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. జూన్ 15 నుంచి గత నెలాఖరు వరకు జరిగిన…
Andhra Pradesh-Financial Inclusion: ప్రజలకు ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఆవశ్యకతను మరింతగా వివరించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాల్లోని 7 జిల్లాల్లో ప్రత్యేక ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ జాబితాలోలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒకటైన ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటం గమనించాల్సిన విషయం. ఈ ప్రత్యేక ప్రచారం ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరుగుతుంది.
EarlySalary rebranded as ‘Fibe’: డిజిటల్ లెండింగ్ స్టార్టప్ ఎర్లీ శాలరీ పేరు మారింది. ‘ఫైబ్’ అనే కొత్త పేరుతో రీబ్రాండింగ్ చేసుకుంటోంది. విస్తరణ ప్రణాళికను కూడా అమలుచేస్తోంది. గతంలో 18 సిటీల్లో మాత్రమే సర్వీసులు అందుబాటులో ఉండగా ఆ సంఖ్యను 150కి పెంచింది. ఇంతకుముందు ప్రతి నెలా 35 వేల మంది కొత్త వినియోగదార్లనే చేర్చుకున్న ఈ సంస్థ ఇప్పుడు కస్టమర్ బేస్‌ని ఏకంగా లక్షకు పెంచటం విశేషం.
RBI-Card Tokenisation: కార్డ్ టోకెనైజేషన్ కోసం విధించిన డెడ్‌లైన్ రేపు శుక్రవారంతో ముగియనుంది. అయితే ఈ గడువును పొడిగించే ఆలోచన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లేనట్లు కనిపిస్తోంది. డెడ్‌లైన్ పొడిగించాలని చిన్న వ్యాపారుల నుంచి డిమాండ్లు వస్తున్నప్పటికీ కేంద్ర బ్యాంకు నుంచి మాత్రం అలాంటి సానుకూల సంకేతాలేవీ ఇప్పటివరకు వెలువడలేదు. కార్డ్ డేటాను భద్రపరచడానికి ఆర్బీఐ ఈ భారీ కసరత్తును మూడేళ్ల కిందటే ప్రారంభించింది.
Youtube Shorts: మన దేశంలో మొబైల్ ఫస్ట్ క్రియేటర్స్‌కి యూట్యూబ్ షార్ట్స్ తెరిచిన ద్వారమని ఆసియా-పసిఫిక్ రీజనల్ డైరెక్టర్ విద్యాసాగర్ అన్నారు. రెండేళ్ల కిందట తొలిసారిగా ఇండియాలోనే యూట్యూబ్ షార్ట్స్‌ను ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. యూట్యూబ్‌లో షార్ట్-ఫామ్ కంటెంట్‌ని క్రియేట్ చేయటం మరియు ఈజీగా వీక్షించటం కోసం వీటికి రూపకల్పన చేశామని చెప్పారు. యూట్యూబ్ షార్ట్స్.. ప్రపంచవ్యాప్తంగా ఒకటిన్నర బిలియన్‌ల కన్నా ఎక్కువ మంత్లీ లాగిన్ చేసే యూజర్స్ కమ్యూనిటీని పెంచుకున్నాయి.
England Currency: ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్-2 ఇటీవల మరణించిన నేపథ్యంలో ఆ దేశానికి కొత్తగా రాజైన కింగ్ ఛార్లెస్-3 ఫొటోతో కూడిన కరెన్సీ నోట్లు 2024 మధ్య నుంచి చెలామణిలోకి వచ్చే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తెలిపింది. ప్రస్తుతం వాడుతున్న పాలిమర్ నోట్లపై రాణి ఎలిజబెత్-2 ఫొటో1960 నుంచి కొనసాగుతోంది. ఆ నోట్లు మాసిపోయినప్పుడు లేదా డ్యామేజ్ అయినప్పుడు మాత్రమే సర్క్యులేషన్ నుంచి తొలగిస్తామని BOE వివరించింది.
Demat Accounts Jumped: ఏడాది వ్యవధిలోనే డీమ్యాట్ ఖాతాల సంఖ్య 43 శాతం పెరిగింది. దీంతో మొత్తం అకౌంట్ల సంఖ్య 11 కోట్ల 45 లక్షలకు చేరినట్లు బీఎస్‌ఈ రిజిస్టర్డ్ ఇన్వెస్టర్స్ డేటా వెల్లడించింది. ఆగస్టు నెలలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు గతంలో ఎన్నడూ లేనంతగా అంటే రూ.12,693 కోట్లు పెరిగాయి. డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య భారీగా పెరగటాన్ని బట్టి మన దేశంలో ఆర్థిక అక్షరాస్యత, ఇన్వెస్ట్‌మెంట్లు, స్టాక్ మార్కెట్లపై ప్రజల్లో అవగాహన పెరిగినట్లు భావించొచ్చనే విశ్లేషణలు…
Crorepati Factory Meesho: మన దేశంలోని మొట్టమొదటి సోషల్ కామర్స్ ప్లాట్‌ఫాం అయిన మీషో.. లక్షాధిపతులను తయారుచేసే ఫ్యాక్టరీగా పేరొందుతోంది. ఇప్పటివరకు లక్షా 23 వేల మంది చిన్న వ్యాపారులను లక్షాధికారులను చేసింది. టయర్-2 నుంచి టయర్-4 సిటీల వరకు యూజర్ పెనట్రేషన్ విషయంలో మీషో.. అమేజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లను అధిగమించింది. యాప్ సైజ్, డూయింగ్ బిజినెస్ వీడియోలు, మంత్లీ విజిట్స్‌తో మీషో రూరల్ ఏరియాల్లోకి కూడా శరవేగంగా విస్తరిస్తోంది.