‘Fine’ Apple: ఛార్జర్ లేకుండా ఐఫోన్ అమ్మొద్దని బ్రెజిల్ ప్రభుత్వం యాపిల్ సంస్థను ఆదేశించింది. ఈ మేరకు అఫిషియల్ గెజిట్‌లో పేర్కొంది. ఫోన్‌కి ఛార్జర్ అవసరమని తెలిసినప్పటికీ ఆ సంస్థ ఉద్దేశపూర్వకంగానే వినియోగదారులపై వివక్ష చూపినట్లు తప్పుపట్టింది. ఈ తప్పు చేసినందుకు 2 పాయింట్ మూడు ఎనిమిది మిలియన్ డాలర్ల జరిమానా కూడా విధించింది. ఇక మీదట ఛార్జర్ లేకుండా ఏ ఐఫోన్ మోడల్‌నీ విక్రయించొద్దని తేల్చిచెప్పింది.
Indian Youth Opting Gig jobs: మన దేశంలో యువత గతంలో ఎన్నడూ లేనంతగా గిగ్ జాబ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో గతేడాది కన్నా 50 శాతం ఎక్కువ మంది ఈ కొలువుల్లో చేరారు. ముఖ్యంగా జాబ్ ఫ్లెక్సిబిలిటీ ఉండటం వల్ల 3 నుంచి 5 ఏళ్ల అనుభవం కలిగినవారు వీటిపై ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు ఫ్లెక్సింగిట్ అనే ఫ్రీల్యాన్స్ జాబ్స్ ప్లాట్‌ఫాం వెల్లడించింది. టెక్నాలజీ స్కిల్స్‌కి డిమాండ్ నెలకొనటం…
Retirement Age Hike: రిటైర్మెంట్ వయసు పెంచాలనే ప్రతిపాదనకు ఈపీఎఫ్‌ఓ కూడా అనుకూలంగా ఓటేస్తోంది. తద్వారా పెన్షన్ ఫండ్లపై ఒత్తిడి తగ్గుతుందని అంచనా. విజన్-2047 డాక్యుమెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. మరో పాతికేళ్లలో మన దేశంలో 60 ఏళ్ల వయసు పైబడేవారి సంఖ్య దాదాపు 140 మిలియన్ల మందికి చేరుతుందని పేర్కొంది. రిటైర్మెంట్ వయసు పెంపు అనేది ఇతర దేశాల్లో అమలవుతున్నట్లు తెలిపింది.
Mobikwik: మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థ మొత్తం ఆదాయం 80 శాతం పెరిగి 540 కోట్లకు చేరినట్లు ఫిన్‌టెక్ కంపెనీ మొబీక్విక్ వెల్లడించింది. ఇందులో 300 కోట్లకు పైగా ఆదాయం 2020-21లోనే సమకూరినట్లు స్పష్టం చేసింది. ఆ సంవత్సరం 30 కోట్లు మాత్రమే కంట్రిబ్యూషన్ మార్జిన్ రాగా అది ఇప్పుడు రూ.145 కోట్లకు పెరిగిందని పేర్కొంది.
India's Good News to World: ప్రపంచంలోనే ఎక్కువ చక్కెరను ఉత్పత్తి చేస్తున్న మన దేశం వచ్చే సీజన్ నుంచి అంటే ఈ ఏడాది అక్టోబర్ నుంచి రెండు విడతల్లో విదేశాలకు ఎగుమతులు చేయనుంది. ఇటు రైతులు.. అటు వినియోగదారులు.. ఇద్దరి ప్రయోజనాలనూ బ్యాలెన్స్ చేస్తూ ఎవరికీ చేదు అనుభవం ఎదురుకాకుండా ముందుచూపుతో వ్యవహరించనుంది. షుగర్ ఎక్స్‌పోర్ట్‌లపై ప్రస్తుత సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సప్లై తగ్గి ధరలు పెరిగాయి.
Disney Follows Amazon Prime: అమేజాన్ ప్రైమ్ మాదిరిగానే డిస్నీ కస్టమర్లకి కూడా త్వరలో డిస్నీ ప్రైమ్ అందుబాటులోకి రానున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. సబ్‌స్క్రిప్షన్ సర్వీసులను ప్రారంభించేందుకు ఈ సంస్థ కసరత్తు చేస్తోంది. డిస్నీ ప్లస్ అనే స్ట్రీమింగ్ సర్వీస్‌తోపాటు డిస్నీ ప్రైమ్ కూడా ఆరంభమైతే బ్రాండెడ్ మర్చెండైజ్‌లు, థీమ్ పార్క్‌లు, ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్లు ప్రకటించనుంది. అమేజాన్ ప్రైమ్‌ని స్ఫూర్తిగా తీసుకొని డిస్నీ ఎగ్జ్‌క్యూటివ్‌లు ఈ కొత్త ప్రణాళికను రచించారు.
Increase Credit: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించింది. క్రెడిట్ గ్రోత్‌ను మరింత పెంచాలని, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ల స్థితిగతుల పైన కూడా ఫోకస్ పెట్టాలని ఆదేశించింది. నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కార్యకలాపాలను ప్రారంభించటంపై ఆసక్తితో ఉన్నామని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది.
Startups Achieved Unicorn Status: ఇండియన్ యూనికార్న్ క్లబ్‌లో ఈ ఏడాది కొత్తగా 20 స్టార్టప్‌లు చేరాయి. దీంతో ఇండియన్ యూనికార్న్‌ల మొత్తం సంఖ్య 106కి పెరిగింది. వీటన్నింటి అంచనా విలువ 343 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇందులో 94 బిలియన్ డాలర్ల ఫండింగ్‌ని ఈ స్టార్టప్‌లు బయటి సంస్థల నుంచి రైజ్ చేయటం విశేషం.
EPFO News: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో మూడు నెలల నుంచి ప్రతి నెలా 10 లక్షల మందికి పైగానే ఉద్యోగులు నమోదవుతుండటం విశేషం. ఏప్రిల్‌లో 10 లక్షల 9 వేలు, మే నెలలో 10 లక్షల 7 వేలు, జూన్‌లో 10 లక్షల 54 మందికి పైగా చేరినట్లు జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది.