Seven Metal Companies into TATA Steel: టాటా గ్రూప్‌కి చెందిన ఏడు మెటల్ కంపెనీలు టాటా స్టీల్‌లో విలీనమయ్యాయి. ఈ విలీనానికి టాటా స్టీల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కి సమర్పించిన వివరాల ప్రకారం.. టాటా స్టీల్‌లో విలీనమైన ఆ మెటల్ కంపెనీల పేర్లు.. టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ది టిన్‌ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, టాటా మెటాలిక్స్ లిమిటెడ్, TRF లిమిటెడ్, ది ఇండియన్…
AP, Telangana: ఇంటర్నేషనల్ మార్కెట్లలో వైద్య పరికరాల ఎగుమతుల ప్రోత్సాహకానికి ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌ని ఏర్పాటుచేసినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫార్మాస్యుటికల్స్ డిపార్ట్‌మెంట్‌లో భాగంగా పనిచేసే ఈ కౌన్సిల్ హెడ్‌క్వార్టర్స్ నోయిడాలో ఉంటుందని, బ్రాంచ్ ఆఫీసులు ఏపీ, తెలంగాణల్లో ఉంటాయని పేర్కొంది. మన దేశం గత ఆర్థిక సంవత్సరంలో 23 వేల 766 కోట్ల రూపాయల విలువైన మెడికల్ డివైజ్‌లను ఎగుమతి చేసింది.
Record Level Sales in Festive Season: మన దేశంలో పండగ సీజన్ ప్రారంభం కావటంతో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల విలువ రికార్డ్ స్థాయిలో 61 వేల కోట్ల రూపాయలు దాటనున్నట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. సేల్ అయ్యే ప్రతి మూడు స్మార్ట్‌ఫోన్లలో ఒకటి 5జీ ఎనేబుల్డ్ ఫోన్ కానుందని పేర్కొంది. ఈ మొత్తం విక్రయాల్లో 61 శాతం ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే జరగనున్నాయని తెలిపింది. ఒక స్మార్ట్‌ఫోన్ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ 12 శాతం…
Telangana Company: హైదరాబాద్‌లోని ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కి మహారాష్ట్ర నుంచి 185 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్ వచ్చింది. 123 బస్సుల మ్యానిఫ్యాక్షరింగ్, మెయింటనెన్స్ బాధ్యతలను థానే మునిసిపల్ ట్రాన్స్‌పోర్ట్ అప్పగించింది. ఈ బస్సులను 9 నెలల్లో తయారుచేసి అందించాలని, 15 ఏళ్లపాటు నిర్వహణ చూసుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నారు.
Talibans to ban TikTok, Pubg: ఆఫ్ఘనిస్థాన్‌లో ఇప్పటికే 2 కోట్ల 34 లక్షల వెబ్‌సైట్లను బ్లాక్ చేసిన తాలిబన్ ప్రభుత్వం మరో నెల రోజుల్లో టిక్‌టాక్‌ను, మూడు నెలల్లో పబ్‌జీ యాప్‌ని సైతం బ్యాన్ చేయనున్నట్లు ప్రకటించింది. దేశ అధికార పగ్గాలను తాలిబన్లు చేజిక్కించుకున్న ఈ ఏడాది కాలంలో అనైతిక కంటెంట్‌ను ప్రచురించాయనే ఆరోపణలతో ఈ నిషేధం విధించింది. అయినప్పటికీ ఆయా వెబ్‌సైట్లు కొత్త పేజీలతో పుట్టుకొస్తున్నాయని అసహనం ప్రదర్శించింది.
Chinese Loan Apps: హైదరాబాద్ సహా దేశంలోని 16 చోట్ల చైనా లోన్ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిపింది. బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ, పుణె, గురుగ్రామ్ తదితర నగరాల్లో నిర్వహించిన సోదాల్లో 46 కోట్ల రూపాయలను సీజ్ చేసింది. హెచ్‌పీజెడ్ టోకెన్ యాప్‌లో డబ్బు పెట్టుబడి పెట్టి బిట్‌కాయిన్‌తోపాటు ఇతర క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేస్తే రెట్టింపు సొమ్ము ఇస్తామంటూ కేటుగాళ్లు అమాయకులను మోసగిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో రైడ్స్ చేశామని ఈడీ అధికారులు తెలిపారు.
SBI Cards Fund raise: ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ సంస్థ.. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ బేసిస్‌లో బాండ్లు జారీ చేయటం ద్వారా 500 కోట్ల రూపాయల ఫండ్ రైజ్ చేసింది. 5 వేల ఫిక్స్‌డ్ రేట్, అన్‌సెక్యూర్డ్, ట్యాక్సబుల్ అండ్ రిడీమబుల్ బాండ్లను విడుదల చేశామని తెలిపింది. ఒక్కొక్కటి 10 లక్షల రూపాయల చొప్పున విలువ చేసే ఈ బాండ్లను నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలో ఇన్వెస్టర్లకు కేటాయించినట్లు వెల్లడించింది. వీటి కాల వ్యవధి మూడేళ్లని, 2025…
Cent Percent Work From Home: స్పెషల్ ఎకనమిక్ జోన్ యూనిట్లలో 100 శాతం ‘వర్క్ ఫ్రం హోం’ కావాలంటున్న ఇండస్ట్రీ డిమాండ్‌ను పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రతిపాదన వల్ల చిన్న సిటీల్లో ఉద్యోగావకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుపడుతుందని, సర్వీసుల ఎగుమతులు పెరుగుతాయని కూడా అంచనా వేస్తున్నట్లు తెలిపింది.
Hyderabad's Reality Boom: హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం కరోనా ప్రభావం నుంచి గణనీయంగా కోలుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకు (8 నెలల్లోనే) 22 వేల 680 కోట్ల రూపాయల విలువైన 46,078 రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు సేల్ అయ్యాయి. ఆగస్టు నెలలో 5,181 రెసిడెన్షియల్ ప్రాపర్టీలు రిజిస్టర్ అయ్యాయి. జులై నెలతో పోల్చితే ఇది 20 శాతం ఎక్కువ కావటం చెప్పుకోదగ్గ విషయం. జులైలో ఆషాఢం వల్ల ఇళ్ల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లకు ప్రజలు పెద్దగా ఆసక్తి…
Indane Gas Customers: ఇండేన్ గ్యాస్ బుకింగ్, డెలివరీ సేవల్లో రెండు రోజులుగా అంతరాయం ఏర్పడినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని, బహుశా ఈ రోజు సాయంత్రానికి ఇబ్బందులు తొలిగిపోతాయని, దీంతో రేపటి నుంచి యథావిధిగా సర్వీసులు తిరిగి ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు నిన్న మంగళవారం పేర్కొంది. అయితే అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో మాత్రం చెప్పలేదు.