Land Grab : రాయదుర్గం లో భారీ భూ దందా వెలుగులోకి వచ్చింది. 1500 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని అసిస్టెంట్ సబ్ రిజిస్ట్రార్ కొట్టేసిన ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ గ్రీక్ బిల్డర్స్ తో కలిసి.. ప్రభుత్వ ఆస్తిని కాజేశాడు సదరు అధికారి.. ప్రైవేట్ వ్యక్తులకు సహకరించి సబ్ రిజిస్ట్రార్ నకిలీ పత్రాలు సృష్టించారు. కాజేసిన స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్, హై రైజ్డ్ బిల్డింగ్ నిర్మాణానికి ఏర్పాట్లు చేసింది గ్రీక్ బిల్డర్స్. రెవెన్యూ అధికారుల చొరవతో…
హైదరాబాద్ అత్తాపూర్లోని అక్బర్ హిల్స్లో ల్యాండ్ కబ్జాకు పాల్పడ్డారు. 9 మంది రౌడీ షీటర్ల ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్.ఓ.టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నగర శివారు ప్రాంతాలలో భూ కబ్జాలకు పాల్పడుతూ యాజమానులను బెదిరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కిడ్నాపైన ఎమ్మార్పీస్ నాయకుడు కేసులో వీరి పాత్ర ఉంది. వారి వద్ద నుంచి ఒక తుపాకీ తల్వార్లు, ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖలో భూ ఆక్రమణల తొలగింపుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు అధికారులు. గాజువాక మండలంలో అన్యాక్రాంతమైన యూ.ఎల్.సి.భూములు గుర్తించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అధీనంలో యూ.ఎల్.సి.భూములు ఉన్నట్టు నిర్ధారించుకున్నారు రెవెన్యు అధికారులు. ప్రస్తుతం విశాఖ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు గా ఉన్నాడు పల్లా. తుంగ్లాం, కాపు జగ్గరాజుపేట పరిధిలో ఆక్రమణలు గుర్తించి కూల్చి వేస్తున్నారు రెవెన్యు యంత్రాంగం. సర్వే నంబర్ 29/1 లో ఉన్న భూమి ఐదెకరాల 42 సెంట్లు భూమిలో ప్రహరీగోడలు తొలగించారు. ఈ…