హైదరాబాద్ అత్తాపూర్లోని అక్బర్ హిల్స్లో ల్యాండ్ కబ్జాకు పాల్పడ్డారు. 9 మంది రౌడీ షీటర్ల ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్.ఓ.టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నగర శివారు ప్రాంతాలలో భూ కబ్జాలకు పాల్పడుతూ యాజమానులను బెదిరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కిడ్నాపైన ఎమ్మార్పీస్ నాయకుడు కేసులో వీరి పాత్ర ఉంది. వారి వద్ద నుంచి ఒక తుపాకీ తల్వార్లు, ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. కబ్జా చేసిన ల్యాండ్లో బోన్లలో కుక్కలు.. లోపలికి ఎవరైనా వస్తే కుక్కలతో అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉంచారు. కోట్ల రూపాయలు విలువ చేసే సుమారు 500 గజాల ల్యాండ్లో రౌడీ ముఠా తిష్ఠ వేసింది. ల్యాండ్ ఎవరిది అనే కోణంలో పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కబ్జా పాల్పడిన ల్యాండ్ యజమానులు ఎవరైనా ఉంటే పోలీసులు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అత్తాపూర్లోని అక్బర్ హిల్స్లో 500 గజాల ల్యాండ్ కబ్జా స్థలాన్ని రాజేందర్ నగర్ డీసీపీ శ్రీనివాస్ పరిశీలించారు.
MP: రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న మహిళలు..వారిపై మొరంవేసి సజీవ సమాధికి యత్నం
ఈ సందర్భంగా రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఎన్టీవీతో మాట్లాడారు. అత్తాపూర్లోని అక్బర్ హిల్స్లో 500 గజాల ల్యాండ్ కబ్జా అయిందని.. 9 మంది కబ్జా రౌడీ ముఠాను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల వద్ద నుంచి 4 డెడ్లీ వేపన్స్ కత్తులు, ఒక ఎయిర్ పిస్టోల్, గొడ్డలి రాడ్లు, నకిలీ డాక్యుమెంట్స్ సీజ్ చేసామని తెలిపారు. అత్తాపూర్లో 9 మంది రౌడీ షీటర్ల నేర ప్రమేయం పై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. రౌడీ గ్యాంగ్ సంబంధించి సమాచారం స్థానికుల ద్వారా సమాచారం తమకు అందిందని చెప్పారు. వెంటనే రైడ్ చేసి పట్టుకున్నామని పేర్కొన్నారు. ఇటీవలే గండిపేట్ బృందావన్ కాలనీ, శంషాబాద్ మీర్స్ బ్రదర్స్ ఫాంహౌస్, ఇప్పుడు అత్తాపూర్ అక్బర్ అలీ కాలనీ ల్యాండ్.. ముడు చోట్ల లాండ్ కబ్జా చేశారు ఈ ముఠా అని తెలిపారు. కొద్దిరోజుల క్రితం కిడ్నాపైన ఎమ్మార్పీస్ నాయకుడు కేసులో వీరి పాత్ర ఉందని చెప్పారు.
Ajit Pawar: మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది..
కోట్ల రూపాయలు విలువ చేసే సుమారు 500 గజాల ల్యాండ్ ఒక మహిళ యజమానిగా తెలుస్తోందని డీసీపీ తెలిపారు. ఆమె ఎవరో తెలియదు.. ప్రస్తుతం మహిళ పొజిషన్లో లేదన్నారు. మహిళకు చెందిన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి కబ్జా చేశారని చెప్పారు. ల్యాండ్ ఎవరిది అనే కోణంలో పూర్తి వివరాలు సేకరిస్తున్నామని.. కబ్జా పాల్పడిన ల్యాండ్ యజమానులు ఎవరైనా ఉంటే పోలీసులు సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.