ఐఆర్‌సిటిసి కుంభకోణం కేసులో అభియోగాలు మోపడాన్ని సవాలు చేస్తూ ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు జనవరి 5 సోమవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి నోటీసు జారీ చేసింది. జస్టిస్ స్వరణ్ కాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం సీబీఐ నుండి ప్రతిస్పందన కోరింది. అయితే, ప్రస్తుతానికి విచారణను నిలిపివేయడానికి కోర్టు నిరాకరించింది. లాలూ యాదవ్ , అతని భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌తో పాటు…
ఎట్టకేలకు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసింది. పాట్నాలోని 10 సర్క్యులర్ రోడ్‌లోని బంగ్లాలో 19 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలైంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని లాలూ కుటుంబానికి నోటీసులు ఇచ్చింది. దీనిపై గత కొద్దిరోజులుగా రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఖాళీ చేసేందుకు నిరాకరించింది. ముఖ్యమంత్రులుగా పని చేసిన తమకు బంగ్లాను…
Tej Pratap Yadav: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కేంద్రానికి, కేంద్ర హోం మంత్రికి అరుదైన అభ్యర్థన చేశారు. తన తల్లిదండ్రులు మానసిక వేధింపులకు గురయ్యారా అని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించాలని కేంద్రాన్ని, బీహార్ ప్రభుత్వాన్ని కోరారు. ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురైన తేజ్ ప్రతాప్ ఎన్నికల ముందు జనశక్తి జనతాదళ్ అనే పార్టీని పెట్టి, మహువా నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
Bihar Politics: బీహార్ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమిని ముందుండి నడిపించిన, సీఎం అభ్యర్థిగా ఉన్న తేజస్వీ యాదవ్ ఒకానొక దశలో ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది, చివరకు స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. 243 సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీ కేవలం 25 సీట్లకు మాత్రమే పరిమితమైంది. మహాఘట్బంధన్ కూటమి కేవలం 35 సీట్లను మా
Lalu Family Crisis: బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీలో దుమారానికి కారణమైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో, 243 సీట్లకు గానూ ఎన్డీయే కూటమి 202 సీట్లు సాధిస్తే, ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి 35 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఆర్జేడీ కేవలం 25 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
RJD: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ-జేడీయూ-ఎల్జేపీల కూటమి 243 సీట్లలో ఏకంగా 202 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష ఆర్జేడీ నేతృత్వంలోని కాంగ్రెస్, కమ్యూనిస్టుల కూటమి ‘‘మహా ఘట్బంధన్’’ కేవలం 35 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
Bihar: బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ దారుణంగా పరాజయం పాలైంది. తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని పార్టీ కనీసం గౌరవప్రదమైన సీట్లను కూడా సంపాదించలేకపోయింది. పార్టీ చరిత్రలోనే రెండో అత్యంత దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొంది. ఆర్జేడీ నేతృత్వంలోని కాంగ్రెస్, కమ్యూనిస్టుల ‘‘మహా ఘ
PM Modi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉండటంతో ప్రధాని నరేంద్రమోడీ తన ప్రచారాన్ని తీవ్రం చేశారు. సోమవారం, ప్రధాని మోడీ ఆర్జేడీ పార్టీపై లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Asaduddin Owaisi: బీహార్ ఎన్నికలకు మరో కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అందరు నేతలు ప్రచారాన్ని తీవ్రం చేశారు. తాజాగా, ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వీ యాదవ్, ఓవైసీని ‘‘ఉగ్రవాది’’గా పిలవడం కొత్త వివాదానికి కారణమైంది. దీనిపై ఓవైసీ స్పందిస్తూ.. ‘‘బాబు ఉగ్రవాది(extremist)ని ఇంగ్లీషులో రాయగలరా..?’’ అంటూ సెటైర్లు వేశారు.
Amit Shah: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు వ్యాఖ్యల పదును పెరిగింది. ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నిస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏన్డీయే సీఎం అభ్యర్థి నితీష్ కుమార్ అని స్పష్టం చేశారు.