PM Modi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉండటంతో ప్రధాని నరేంద్రమోడీ తన ప్రచారాన్ని తీవ్రం చేశారు. సోమవారం, ప్రధాని మోడీ ఆర్జేడీ పార్టీపై లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ పాపాలను దాచడానికి ప్రయత్నిస్తున్నాడని, ఆయన ఫోటోలను ఆర్జేడీ పోస్టర్లలో మూలకు ఉంచారని ప్రధాని అన్నారు.
Read Also: AP High Court: చిన్నారి వైష్టవి కిడ్నాప్, హత్య కేసు.. ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
కతియార్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. తండ్రీకొడుకు పేర్లను నేరుగా ప్రస్తావించకుండా, ‘‘జంగిల్ రాజ్‌కే యువరాజ్’’ అంటూ మాట్లాడారు. పెద్ద నాయకుడిగా చెప్పుకునే లాలూ ఫోటోలు ఆర్జేడీ పోస్టర్లపై ఉంచకపోవడంపై మాట్లాడుతూ..జంగిల్ రాజ్ భారాన్ని మోస్తున్నందు వల్లే ఇలా చేస్తున్నాడని అన్నారు. బీహార్‌లో అత్యంత అవినీతి కుటుంబం ఆర్జేడీ కుటుంబం అని, దేశంలో అత్యంత అవినీతి కుటుంబం కాంగ్రెస్ అని ప్రధాని ఆరోపించారు. తేజస్వీ యాదవ్ ను సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ అతి కష్టం మీద అంగీకరించిందని అన్నారు. ఆర్జేడీ ఓడిపోయేందుకు కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
బీహారీలను ఎగతాళి చేసే తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రుల్ని కాంగ్రెస్, ఆర్జేడీ నాయకులు రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారని అన్నారు. ఎన్డీయే పాలన అభివృద్ధిని అందిస్తే, ఆర్జేడీ ఆటవిక పాలనను అందించిందని దుయ్యబట్టారు. ఆర్జేడీ-కాంగ్రెస్‌లు రెండూ చొరబాటుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని, అయోధ్యలో రామమందిరం, ఛత్ పూజల్ని అపహాస్యం చేస్తు్న్నారని ప్రధాని మోడీ ఆరోపించారు. ఆర్జేడీ మతోన్మాదుల ఒత్తిడితో వక్ఫ్ చట్టాన్ని రద్దు చేస్తామని చెబుతోందని అన్నారు.