2008లో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ దోస్తానా. అభిషేక్, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశాడు కరణ్ జోహార్. 2019లో కార్తీక్ ఆర్యన్, జాన్వీ, లక్ష్య హీరో హీరోయిన్లుగా దోస్తానా సీక్వెల్ ఎనౌన్స్ చేశాడు ప్రొడ్యూసర్. కానీ కరణ్- కార్తీక్ ఆర్యన్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఈ సినిమాతోనే…
ఈరోజు ఓటిటిలో మూడు ఆసక్తికర సినిమాలు విడుదల అయ్యాయి. కరోనా మహమ్మారి వచ్చాక చాలా మంది సినిమాలు ఓటిటిలో ప్రీమియర్ అయ్యేదాకా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కరోనా టెన్షన్ ఏమాత్రం లేకుండా ఇంట్లోనే కూర్చుని ఫ్యామిలీతో హ్యాపీగా సినిమాలను చూడొచ్చు. అయితే థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ ఇంట్లో రాదనే వారూ లేకపోలేదు లెండి. అది వేరే విషయం. ఇక మ్యాటర్ లోకి వస్తే… ఈరోజు మూడు పెద్ద సినిమాలు ఓటిటిలో ప్రీమియర్ అవుతున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన…
యంగ్ హీరో నాగశౌర్య నటించిన రెండు సినిమాలు ఈ యేడాది ద్వితీయార్థంలో విడుదలయ్యాయి. చిత్రం ఏమంటే ఈ రెండు చిత్రాల ద్వారా ఇద్దరు కొత్త దర్శకులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగశౌర్య, రీతువర్మ జంటగా నిర్మించిన ‘వరుడు కావలెను’ మూవీతో లక్ష్మీ సౌజన్య తొలిసారి మెగాఫోన్ పట్టింది. ఇది అక్టోబర్ 29న విడుదల కాగా ఈ డిసెంబర్ 10న నాగశౌర్య నటించిన ‘లక్ష్య’ మూవీ జనం ముందుకు వచ్చింది. బాధాకరం…
యంగ్ హీరో నాగశౌర్య 20వ చిత్రం ‘లక్ష్య’. ఫుల్ మేకోవర్ తో విలుకాడిగా నాగశౌర్య నటిస్తున్న ఈ మూవీ ఇదే నెల 10వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ‘రొమాంటిక్’ ఫేమ్ కేతికా శర్మ హీరోయిన్ గా నటించిన ‘లక్ష్య’ మూవీతో సంతోష్ జాగర్లమూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్రీడా, సినీ…
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటుడు నాగ శౌర్య ఇటీవల “వరుడు కావలెను” అనే సినిమాతో విజయం సాధించారు. ప్రస్తుతం సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన తన స్పోర్ట్స్ డ్రామా ‘లక్ష్య’ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. డిసెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ తో పాటు ఇతర అప్డేట్స్ సినిమాపై బజ్…
డిసెంబర్ 10వ తేదీ మూడు స్పోర్ట్స్ బేస్డ్ మూవీస్ తెలుగులో విడుదల కాబోతున్నాయి. అందులో ఒకటి నాగశౌర్య ‘లక్ష్య’ కాగా, మరొకటి కీర్తి సురేశ్ నటిస్తున్న ‘గుడ్ లక్ సఖి’. అలానే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మార్షల్ ఆర్ట్స్ మూవీ ‘అమ్మాయి’ కూడా అదే రోజు రాబోతోంది. ‘లక్ష్య’ మూవీలో నాగశౌర్య విలుకాడిగా నటిస్తున్నాడు. అతను పోషిస్తున్న పార్ధు అనే పాత్ర కోసం మేకోవర్ చేయడమే కాదు, విలువిద్యలోనూ శిక్షణ తీసుకున్నాడు. జాతీయ ఉత్తమ నటి…
ప్రామిసింగ్ యంగ్ హీరో నాగశౌర్య తాజా చిత్రం ‘లక్ష్య’ విడుదల తేదీ ఖరారైంది. నవంబర్ 12వ తేదీని అతని 20వ చిత్రమైన ‘లక్ష్య’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుకుంటోంది. ఇందులో కేతికా శర్మ కథానాయికగా నటిస్తోంది. సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్మోహన్ రావ్, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిన్న…
యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా, ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘లక్ష్య’.. కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. భారతదేశ ప్రాచీన విద్య ఆర్చెరీ నేపథ్యంతో ‘లక్ష్య’ సినిమా తెరకెక్కుతోంది. ఎగ్జయిటింగ్ ఎలిమెంట్స్ తో, ఎంటర్‌టైనింగ్ వేలో, ఎంగేజింగ్‌గా స్క్రిప్ట్ తో దీనిని తెరకెక్కించినట్టు దర్శకుడు ధీరేంద్ర సంతోష్ చెబుతున్నారు. ఇందులో రెండు వైవిధ్యమైన లుక్స్ తో నాగశౌర్య ఆకట్టుకోబోతున్నారని, రెండింటి మధ్య వేరియేషన్ చూపించడానికి ఆయన కష్టపడ్డ తీరు స్ఫూర్తిదాయకమ’ని దర్శకుడు చెబుతున్నారు.…
ప్రామిసింగ్ యంగ్ హీరో నాగశౌర్య ల్యాండ్ మార్క్ 20వ చిత్రం ‘లక్ష్య’ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియచేస్తూ, దర్శకుడు ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి ఓ సీన్‌ని నాగశౌర్యకి వివరిస్తున్న స్టిల్ ను చిత్ర బృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. నాగశౌర్య సైతం దానిని ట్వీట్ చేశాడు. హీరోనీ, దర్శకుడినీ చూస్తుంటే వాళ్ల మధ్య ఎలాంటి ర్యాపో ఉందో ఇట్టే అర్థం అయిపోతోంది. ఇందులోనే మరో స్టిల్ లో హీరోయిన్ కేతిక శర్మతో పాటు మానిటర్…