ప్రామిసింగ్ యంగ్ హీరో నాగశౌర్య ల్యాండ్ మార్క్ 20వ చిత్రం ‘లక్ష్య’ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియచేస్తూ, దర్శకుడు ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి ఓ సీన్‌ని నాగశౌర్యకి వివరిస్తున్న స్టిల్ ను చిత్ర బృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. నాగశౌర్య సైతం దానిని ట్వీట్ చేశాడు. హీరోనీ, దర్శకుడినీ చూస్తుంటే వాళ్ల మధ్య ఎలాంటి ర్యాపో ఉందో ఇట్టే అర్థం అయిపోతోంది. ఇందులోనే మరో స్టిల్ లో హీరోయిన్ కేతిక శర్మతో పాటు మానిటర్ చూస్తూ ఉన్నారు నాగశౌర్య. ఇదిలా ఉంటే… భారతదేశ ప్రాచీన విద్య ఆర్చెరీ నేపథ్యంతో ‘లక్ష్య’ సినిమా తెరకెక్కుతోంది. ఎగ్జయిటింగ్ ఎలిమెంట్స్ తో, ఎంటర్‌టైనింగ్ వేలో, ఎంగేజింగ్‌గా స్క్రిప్ట్ తో దీనిని తెరకెక్కించినట్టు దర్శకుడు ధీరేంద్ర సంతోష్ చెబుతున్నారు. ఇందులో రెండు వైవిధ్యమైన లుక్స్ తో నాగశౌర్య ఆకట్టుకోబోతున్నారని, రెండింటి మధ్య వేరియేషన్ చూపించడానికి ఆయన కష్టపడ్డ తీరు స్ఫూర్తిదాయకమ’ని అన్నారు.
Read Also : అందరూ మోసగాళ్ళే… “అనబెల్ సేతుపతి” ట్రైలర్
డైరక్టర్ సంతోష్ జాగర్లపూడి సరికొత్త కథను నెరేట్ చేయడంతోనే, నాగశౌర్య అందులో ఉన్న అనుపానులను అర్థం చేసుకోవడానికి కావలసిన రీతిలో శిక్షణ తీసుకున్నారు. ఇదే ఫోర్స్ తో షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇప్పుడు టీమ్ తమ ఫోకస్‌ని పోస్ట్ ప్రొడక్షన్ వైపు షిఫ్ట్ చేసింది. నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. సోనాలి నారంగ్ సమర్పణలో ఈ మూవీని నారాయణదాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల మీద ఇది తెరకెక్కుతోంది. వెర్సటైల్ యాక్టర్స్ జగపతి బాబు, సచిన్ కేడేకర్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. దీనికి కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ నూ ప్రకటిస్తామని నిర్మాతలు చెబుతున్నారు.
Anddd ! Its A WRAP 📣#Lakshya 🏹 Shooting Target Achieved ✅
— Naga Shaurya (@IamNagashaurya) August 30, 2021
The journey is memorable.❤️
Targeting to hit your Hearts in Theatres Soon 🎯#KetikaSharma@AsianSuniel @sharrath_marar @SVCLLP @nseplofficial @Santhosshjagar1 @RaamDop @IamJagguBhai @kaalabhairava7 pic.twitter.com/9erW9lUK0Q