Ketika Sharma: అందాల ముద్దుగుమ్మ హ్యాట్రిక్ కొట్టేసిందిగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేతిక శర్మ హ్యాట్రిక్ కొట్టేసింది… ఇది సక్సెస్ విషయంలో అయితే ఆమె, ఆమె ఫ్యాన్స్ సంతోష పడేవాళ్ళు, కానీ పరాజయాల విషయంలో వరుసగా మూడో ఫ్లాప్ ను అమ్మడు అందిపుచ్చుకుంది. దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ హీరోగా తెరకెక్కిన ‘రొమాంటిక్’తో ఈ న్యూఢిల్లీ బొద్దుగుమ్మ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే అడ్డూఅదుపూ లేకుండా అందాలు ఆరబోసింది. అయితే ‘రొమాంటిక్’ విషాదాంత ప్రేమకథ కావడంతో కేతిక శర్మను చూసి యువత ఉసూరుమంది. కానీ గ్లామర్ డాల్ గా మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఇక రెండో సినిమా ‘లక్ష్య’లో మాత్రం కేతిక శర్మకు అన్యాయం జరిగిందనే చెప్పాలి. హీరో నాగశౌర్య మీద పెట్టిన ఫోకస్ హీరోయిన్ పాత్ర మీద దర్శకుడు పెట్టలేదు. దాంతో ఆ సినిమా నటిగానూ కేతికా శర్మకు పేరు తెచ్చిపెట్టలేదు.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
అదే సమయంలో కేతిక శర్మ ముచ్చటగా మూడో సినిమాగా ‘రంగరంగ వైభవంగా’కు సైన్ చేసింది. ఇందులో కథానాయిక పాత్రకు మంచి స్కోపే ఉంది. దాంతో అవకాశం ఉన్న చోటల్లా కేతికా శర్మ చక్కని నటన ప్రదర్శించింది. అయితే… అందాల ఆరబోతకు మాత్రం ఈ సినిమాలో ఛాన్స్ దక్కలేదు. బట్… పంజా వైష్ణవ్ తేజ్ కంటే… కేతికా శర్మే బాగా చేసిందనే పేరైతే వచ్చింది. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో తెలుగులో వరుసగా పరాజయాల విషయంలో కేతిక హ్యాట్రిక్ కొట్టినట్టు అయ్యింది. కానీ ఈ ఫ్లాప్స్ తో ఆమె కెరీర్ కు ఫుల్ స్టాప్ పుడుతుందని నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కేతికా శర్మకు తెలుగులో కొన్ని అవకాశాలు వస్తూనే ఉన్నాయట. ఒక్క హిట్… ఒకే ఒక్క హిట్ అమ్మడి ఖాతాలో పడితే… తిరిగి కెరీర్ ఊపందుకోవడం ఖాయం!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!