ఒకే రోజు మూడు క్రీడా నేపథ్య చిత్రాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 10వ తేదీ మూడు స్పోర్ట్స్ బేస్డ్ మూవీస్ తెలుగులో విడుదల కాబోతున్నాయి. అందులో ఒకటి నాగశౌర్య ‘లక్ష్య’ కాగా, మరొకటి కీర్తి సురేశ్ నటిస్తున్న ‘గుడ్ లక్ సఖి’. అలానే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మార్షల్ ఆర్ట్స్ మూవీ ‘అమ్మాయి’ కూడా అదే రోజు రాబోతోంది. ‘లక్ష్య’ మూవీలో నాగశౌర్య విలుకాడిగా నటిస్తున్నాడు. అతను పోషిస్తున్న పార్ధు అనే పాత్ర కోసం మేకోవర్ చేయడమే కాదు, విలువిద్యలోనూ శిక్షణ తీసుకున్నాడు. జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ ‘గుడ్ లక్ సఖీ’లో గ్రామీణ యువతిగా నటిస్తోంది. అనేకానేక విషయాలలో ఆమెను దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది, అలాంటి ఓ అమ్మాయి షూటింగ్ నేర్చుకుని అందరినీ తనవైపు ఎలా తిప్పుకుందనే కథాంశంతో ‘గుడ్ లక్ సఖీ’ తెరకెక్కింది.

ఈ సినిమాను సీనియర్ దర్శకుడు నగేశ్ కుకునూర్ తెరకెక్కించగా, ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. అలానే ‘లక్ష్య’ సినిమాలో ‘రొమాంటిక్’ ఫేమ్ కేతికా శర్మ హీరోయిన్ గా నటించగా, సచిన్ ఖేద్కర్, జగపతిబాబు కీ-రోల్స్ చేశారు. ఇక వర్మ తెరకెక్కించిన ‘అమ్మాయి’ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ నిపుణురాలైన పూజా భలేకర్ నటిస్తోంది. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, చైనీస్ భాషల్లో విడుదల చేయబోతున్నారు. భారతదేశంలోని ఫస్ట్ రియల్ మార్షల్ ఆర్ట్స్ మూవీ ఇదని వర్మ చెబుతున్నారు. మరి ఈ మూడు క్రీడా నేపథ్య చిత్రాలలో దేనివైపు ప్రేక్షకులు మొగ్గు చూపుతారో చూడాలి.
Also Read
- Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
- Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
తాజావార్తలు
-
Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
-
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
-
Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!