జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శనివారం రాత్రి ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారిద్దరినీ విచారిస్తున్నారు. సమాచారం ప్రకారం.. దిగువ ముండాలోని గులాబ్ బాగ్ ప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానంగా అటుగా వెళ్తుండటంతో.. అనుమానం వచ్చి వారిని ఆగమని భద్రతా బలగాలు చెప్పారు.
Kulgam Encounter: దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లా పరిధిలోని బడిమార్గ్ సమీపంలో భారత దేశ భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఉత్తర కాశ్మీర్ లోని ఎల్‌ఓసీకి ఆనుకుని ఉన్న కుప్వారా జిల్లాలో సైనికులు నలుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టారు. ఎన్‌కౌంటర్ ప్రారంభంలో కొన్ని కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆపై సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగింది. ఎన్‌కౌంటర్ స్థలం చుట్టూ భద్రతా బలగాలు కట్టుదిట్టం చేశాయి.…
జమ్మూకశ్మీర్ కాల్పులతో మర్మోగింది. కుల్గామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక సైనికుడు అమరుడయ్యాడు. శనివారం కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఒక సైనికుడు ప్రాణాలు వదిలాడు.
దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా వాంటెడ్ టెర్రరిస్ట్ బాసిత్ దార్‌తో సహా ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది.
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో మంగళవారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గామ్‌లోని రెడ్‌వానీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు సోమవారం అర్థరాత్రి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిసింది.