KTR : ఉపఎన్నికలే కాంగ్రెస్‌కు గుణపాఠం
- షేక్‌పేటలో పర్యటించిన కేటీఆర్.. ఇంటింటికీ బకాయి కార్డుల పంపిణీ
- “కాంగ్రెస్ గ్యారంటీలన్నీ మోసం” అంటూ కేటీఆర్ ఆరోపణలు
- ఉపఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్న కేటీఆర్
- జూబ్లీహిల్స్ ప్రచారంలో టూరిస్టు మంత్రులపై ఎద్దేవా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్‌పేట ప్రాంతంలో పర్యటించిన ఆయన, ప్రజలతో కలసి ప్రత్యేక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా “కాంగ్రెస్ బకాయి కార్డు” అనే వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టారు. కేటీఆర్ తన బృందంతో కలిసి ఇంటింటికీ వెళ్లి బకాయి కార్డులను అందజేశారు. వాటిలో ప్రతి వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ ఉందో, ఏ ఏ వాగ్దానాలు నెరవేర్చలేదో స్పష్టంగా వివరించారు. ఈ కార్డుల ద్వారా కాంగ్రెస్ చేసిన మోసాలను, అసత్య వాగ్దానాలను ప్రజలకు తెలియజేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు అన్నీ మోసమే. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మాట తప్పుతున్నారు. బకాయి కార్డుల ద్వారా మేము ఈ మోసాన్ని బయటపెడతాం” అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అహంకారానికి, వాగ్దానభంగానికి గుణపాఠం చెప్పే అవకాశం ఉపఎన్నికలు, స్థానిక ఎన్నికలు రూపంలో వచ్చాయని కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పక ఓటమి చవి చూడాల్సిందేనని హెచ్చరించారు.
Also Read
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
- Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
- Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చేవారిని కేటీఆర్ “టూరిస్టు మంత్రులు” అంటూ ఎద్దేవా చేశారు. “ఎన్నికలు ముగిసిన వెంటనే ఆ మంత్రులు, సామంతులు అందరూ గాయబ్ అయిపోతారు. ప్రజల సమస్యలు ఎవరికీ పట్టవు” అని విమర్శించారు. తమ పక్షాన ప్రజాభిప్రాయం బలంగా మారుతోందని, కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల తీర్పు త్వరలోనే స్పష్టమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
-
EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
-
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?