కరీంనగర్ జిల్లా పర్యటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అంశాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసు, యూరియా సరఫరా సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలపై బండి సంజయ్ కడుపుమంట వ్యాఖ్యలు చేసి సర్కారుపై తీవ్రస్థాయిలో దాడి చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనానికి తావిచ్చే పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారీ పరువు నష్టం దావా వేశారు.
తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ కార్యకర్తలతో సమావేశమయ్యారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేటీఆర్ తో పాటు సమావేశంలో పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మాగంటి గోపినాథ్ తయారు చేసిన క్యాడర్ ఇక్కడికి వచ్చింది.. మాగంటి గోపినాథ్ మూడు సార్లు మీ ఆశిస్సులతో గెలిచాడు.. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రజలు కాంగ్రెస్ నాయకులను ఒక్కరిని నమ్మలేదు.. ఒక్కరిని కూడా బిఆర్ఎస్ మినహా ఎవరిని అసెంబ్లీ కి పంపలేదు..…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త దుమారం రేపుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఎక్స్ (X) వేదికగా బీజేపీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. "చోటే భాయ్‌కి చీమ కూడా కుట్టకుండా పహారా కాస్తున్న బడే భాయ్ పార్టీ బీజేపీ" అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష రద్దు, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద హాటు ఘాటు చర్చలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఇక్కడ బైపోల్ తప్పలేదు. వచ్చే రెండు మూడు నెలల్లో ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అందుకోసం అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. సిట్టింగ్ సీటుగా బీఆర్ఎస్కు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున కాంగ్రెస్‌కు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది.
గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మార్పుతో లోకల్ కేడర్‌లో గందరగోళం పెరిగింది. దాంతో నడిగడ్డ కారుకు గట్టి రిపేర్లు చేసి గాడిన పెట్టేందుకు తీవ్ర కసరత్తు చేస్తోందట గులాబీ అధిష్టానం. నెలల తరబడి స్తబ్దుగా ఉన్న గద్వాల్ కేడర్‌లో ఊపు తెచ్చే ప్రయత్నం మొదలైనట్టు తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్....
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయని, కానీ తమకు అండగా నిలిచిన మాగంటి కుటుంబానికి అండగా నిలబడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కేటీఆర్‌ని కలుస్తా.. ఎందుకు కలవకూడదు..? అంటూ ప్రశ్నించారు ఏపీ మంత్రి నారా లోకేష్.. వివిధ సందర్భాల్లో కేటీఆర్‌ను కలిశానన్న ఆయన.. కేటీఆర్‌ను కలవాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అడగాలా?.. రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా? అని ప్రశ్నించారు.