Anirudh Reddy vs KTR: వసూళ్లు, కమీషన్స్, కబ్జాల కోసం కాదు.. కేటీఆర్‌కు జడ్చర్ల ఎమ్మెల్యే కౌంటర్!
- కేటీఆర్‌కు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కౌంటర్
- ప్రజలకు కావాల్సిన అంశంపై ఏరోజైనా స్వేచ్ఛగా మాట్లాడారా?
- నేను పోరాటం చేసేది రైతుల కోసం
- కేటీఆర్ గారు ప్రతిదీ రాజకీయం చేయొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ప్రతిదీ రాజకీయం చేయొద్దు’ అంటూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే అయినా ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూపైన మాట్లాడరా?, తన ప్రజలకు కావాల్సిన అంశంపై ఏరోజైనా స్వేచ్ఛగా మాట్లాడారా? అని ప్రశ్నించారు. తాను పోరాటం చేసేది రైతుల కోసం, జడ్చర్ల నియోజకవర్గం ప్రజల కోసం అని స్పష్టం చేశారు. మీ ఎమ్మెల్యేల మాదిరి తాను వసూళ్లు, కమీషన్స్, కబ్జాల కోసం పని చేయను అని కేటీఆర్‌ను జడ్చర్ల ఎమ్మెల్యే విమర్శించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పోస్ట్ చేశారు.
‘కేటీఆర్ గారు ప్రతిదీ రాజకీయం చేయొద్దు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే అయినా ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడరా, తన ప్రజలకు కావాల్సిన అంశంపై ఏరోజైనా స్వేచ్ఛగా మాట్లాడారా?. మా పార్టీలో, మా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఎక్కువ. మీ పాలన నిరంకుషత్వ పాలన. మీ రౌడీయిజం అరాచకత్వ పాలన చూడలేకనే ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని మిమ్మల్ని బొంద పెట్టారు. నేను పోరాటం చేసేది రైతుల కోసం, నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజల కోసం. మీ ఎమ్మెల్యేల లాగా రౌడీయిజం చేసి ఫ్యాక్టరీల్లో వసూళ్ల కోసం, కమీషన్ల, భూకబ్జాల కోసం నేను పనిచేయనని మీరు గమనించాలి. నేను చెరువుల్లో చేపలు చనిపోతున్నాయని ముదిరాజుల కోసం ఫైట్ చేస్తున్నా. మీ మాజీ ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీల్లో పొల్యూషన్ వచ్చినా.. వాళ్లకు కమీషన్ వస్తే చాలని ఎప్పుడు కూడా ఈ సమస్య పై మాట్లాడలేదని మీరు గుర్తించాలి’ అని కేటీఆర్ ట్వీట్‌కు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రిప్లై ఇచ్చారు.
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
Also Read: DGP Shivadhar Reddy: పోలీస్ శాఖలో 17 వేల పోస్టులు భర్తీ చేస్తాం!
‘స్థానిక సమస్యలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇస్తలేదని పత్రికలకెక్కుతాడు పాలమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే!. భారీవర్షాల వల్ల నియోజకవర్గంలో నష్టం వాటిల్లితే రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తలేదని ఏకంగా ప్రపంచబ్యాంకుకే ఉత్తరం రాసి నవ్వులపాలవుతాడు ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే!. రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సరిగ్గా పనిచేస్తలేదు కాబట్టి పరిశ్రమనే తగులబెడతానని బెదిరించి రౌడియిజం చేస్తాడు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే!. అంతులేని అరాచకత్వమూ, అపరిమితమైన అజ్ఞానమూ రాజ్యమేలుతున్నాయి నేడు తెలంగాణలో. సర్కారు కాదిది సర్కసే!’ అని అంతకుముందు కేటీఆర్ ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!