KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం వెంకంపేట చౌరస్తాలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచిందన్నారు. మా ప్రభుత్వంలో నేత కార్మికులకు ఉపాధి ఉండేది, ఇప్పుడు బతుకమ్మ చీరెలు ఆర్డర్ ఇవ్వకుండా నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చిందన్నారు. నాలుగు నెలల్లో లక్ష పెళ్ళిల్లు జరిగినవి వారికి లక్ష, తులం బంగారం, 4000 పింఛన్ వచ్చిందా? అని ప్రశ్నించారు.
పార్లమెంటులో గట్టిగా కొట్లాడే వినోద్ కుమార్ గెలిపించాలన్నారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని నేను ఓట్లు అడిగిన్నా? అని ప్రశ్నించారు. గుళ్ళు కట్టుడే ప్రాచీన శిల్ప కళకు అద్దం పట్టేలా యాదాద్రి కట్టిండన్నారు. కేసీఆర్ మిడ్ మనేరు కట్టి సిరిసిల్లలో సముద్రం తీసుకు వచ్చిండన్నారు. మోడీ నుండి ఒక్క రూపాయి అన్న లాభం జరిగిందా ఎందుకు ఓటు వేయాలి? అని ప్రశ్నించారు.
Read also: NEET Exam 2024: రేపే నీట్ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
బండి సంజయ్ గెలిచిన ఐదు సంవత్సరాలలో ఒక్క శిల ఫలకం అన్న వేసిండా? అన్ని ఫిరం చేసిన మోడీ ప్రభుత్వానికీ ఎందుకు ఓటు వేయాలి? అని ప్రశ్నించారు. భారతదేశంలో ప్రధానమంత్రి అనడంలేదు ఫిరమైన ప్రధానమంత్రి అంటున్నారని తెలిపారు. బీజేపీ ఒక్క పని అన్న సిరిసిల్ల లో అభివృద్ధి చూపెడితే దేనికైనా రెఢీ అన్నారు. చోట భాయ్, బడా భాయ్ కి ఓటు వేసి వేయకుండా వారికి బుద్ధి చెప్పండన్నారు.
కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునే వాళ్ళు చేతులు లేపండి, నాకు నమ్మకం ఉంది వినోద్ కుమార్ గెలుస్తాడని అన్నారు. మతం పేరు మీద రాజకీయం చేసే వారిని నమ్మకండి అన్నారు. నిన్న జరిగిన సీఎం సభలోనే చేతి విగింది అని చంద్రకల అంటున్నది, కార్ రయ్యిమని ఊరుకాలే అన్నారు. ఈనెల 13 తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ కార్ గుర్తు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్న అన్నారు.
AP Elections 2024: అధికారుల పాపాల చిట్టా బయటకి తీస్తాం.. బుద్ధి చెపుతాం..!