MP Dr. Laxman: గాడిద గుడ్డు కాదు.. మీకు పాము గుడ్డు గుర్తు కావాలని రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం అబద్దాలతో అడ్డ దారులు తొక్కుతుందన్నారు. ఎలాగైనా గెలవాలనే వర్గాల మధ్య ఘర్షణలు సృష్టిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇంతలా దిగజారుడు రాజకీయం చేస్తున్నాడని అన్నారు. అనుకూల వ్యతిరేక వర్గాలను ఏర్పాటు చేసి ఘర్షణ వాతావరణం సృష్టించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు. రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పినప్పటికీ..కావాలనే తాప్పు దారి పట్టిస్తున్నారని అన్నారు. ప్రధాన మంత్రి మోడీ నే స్వయంగా చెప్పినా కూడా రేవంత్ రెడ్డి పదే పదే రిజర్వేషన్ల విషయం ముందు వేస్తున్నాడన్నారు. ఫేక్ వీడియోలు సృష్టించి ప్రజలను మభ్యపెట్టే పనిలో ఉన్నారని తెలిపారు. ఫేక్ వీడియో లు సృష్టించిన వారిని బీజేపీ విడిచిపెట్టదన్నారు.
Read also: Congress Manifesto: నేడు గాంధీభవన్‌లో టీ కాంగ్రెస్ మేనిఫెస్టో..
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం తో ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందన్నారు. ఆ వ్యతిరేకత ను దారి మళ్లించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని అన్నారు. దళితుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్ ను చూస్తే దయ్యాలు వేదాలు వాళ్లిస్తున్నట్లు అనిపిస్తుందన్నారు. అనేక సార్లు బాబా సాహెబ్ అంబేద్కర్ నీ అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ కి గౌరవాన్ని పెంచిందన్నారు. కార్పోరీ ఠాకూర్ కి భారత రత్న ఇచ్చి గౌరవించింది మోడీ ప్రభుత్వం అని తెలిపారు. పేద వర్గాలకు మహిళలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించింది కూడా మోడీ ప్రభుత్వమే అని తెలిపారు. రిజర్వేషన్ ద్వారా వచ్చిన వారే అవకాశాలు పొందుతున్నారని స్వయంగా జవహర్లాల్ నెహ్రూ ప్రస్తావించారని గుర్తు చేశారు. రిజర్వేషన్ల ద్వారా మెరిట్ కి అవకాశం రావడం లేదని దళితులను అవమనిచింది కూడా కాంగ్రెస్ ప్రధాని హోదాలో నెహ్రూ ప్రస్తావించారని అని తెలిపారు.
Read also: Uttarakhand : నైనిటాల్‌లోని నైని సరస్సులో వేగంగా కనుమరుగవుతున్న నీరు
రిజర్వేషన్ లకు వ్యతిరేకం కాంగ్రెస్ అన్నారు. అంబేద్కర్ ఎందుకు రాజీనామా చేశారన్నారు. అంబేద్కర్ రిజర్వేషన్ ప్రతిపాదనలు నెహ్రూ కి నచ్చలేదు … అందుకే ఆయన్ను ఓడించారన్నారు. 1961 లో ప్రధాని హోదాలో నెహ్రూ ముఖ్యమంత్రులకు లేఖ రాశాడు… రిజర్వేషన్ లు అమలు చేస్తే సెకండ్ గ్రెడ్ వ్యక్తులుగా మారుతారని నెహ్రూ అన్నాడని తెలిపారు. మండల్ కమిషన్ రిపోర్ట్ ను వ్యతిరేకించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అన్నారు. కులరహిత దేశం కావాలని… కుల రిజర్వేషన్ లు వదన్నది రాజీవ్ గాంధీ అంటూ మండిపడ్డారు. బీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అధిగిన బీపీ సింగ్ నీ అవమానించారని తెలిపారు. కులాల పేరుతో రిజర్వేషన్ వద్దని చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ నే అన్నారు. అడుగడుగునా రిజర్వేషన్లను అడ్డుకుంది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే అని రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని తెలిపారు.
Read also: Priyank Gandhi: ఆ ఒక్క కారణంతోనే పోటీకి దూరమయ్యారా!?
ముస్లింల ఓట్ల కోసం గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నారని తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన చరిత్ర కూడా మీదే రేవంత్ రెడ్డి అని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో కూడా హిందువుల రిజర్వేషన్ తగ్గించి ముస్లిం లకు రిజర్వేషన్ కల్పించింది కూడా మీ కాంగ్రెస్ పార్టీ లోనే జరిగిందన్నారు. అప్పుడు న్యాయస్థానం మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మొత్తి కాయలు కూడా వేసింది అనే విషయం గుర్తు చేసుకో రేవంత్ రెడ్డి అన్నారు. తొమ్మిది సంవత్సరాల అధికారం తరువాత కేసీఆర్ కి గర్వం పెరిగితే.. కేవలం 90 రోజుల అధికారం లోనే రేవంత్ రెడ్డికి గర్వం పట్టిందన్నారు. దళితులు ఆదివాసీలు వెనుకబడిన వారికి అధికారం అందించిన ఘనత మోడీ ప్రభుత్వం ది అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని రేవంత్ రెడ్డి బిజెపి గాడిద గుడ్డు ఇంచింది అని ప్రస్తావిస్తున్నాడని తెలిపారు. గాడిద గుడ్డు కాదు.. మీకు పాము గుడ్డు గుర్తు కావాలన్నారు.
Read also: Uttarpradesh : భూ వివాదం ఇద్దరు అన్నదమ్ముల దారుణ హత్య.. ఇద్దరి పరిస్థితి విషమం
ఓటుకు నోటు కేసులు నిందితుడిగా ఆన్న రేవంత్ రెడ్డి కి ప్రధానిని విమర్శించే హక్కు లేదన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని నీ అవమాన పరిచే విధంగా మాట్లాడడం సారి కాదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సూచిస్తున్నానని తెలిపారు. మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ కుమ్మకయ్యి ఆమ్ ఆద్మీ పార్టీ జైలు వెళ్ళిందన్నారు. అలాంటి ఆమ్ ఆద్మీ పార్టీ తో కాంగ్రెస్ దోస్తీ చేస్తుందన్నారు. దీనిని చూస్తే ఎవరు ఎవరికి సపోర్ట్ చేతున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. రేవంత్ రెడ్డి కి చిత్త శుద్ది ఉంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిగ్గు తేల్చాలని తెలిపారు. ఓక వేల నిగ్గు తేల్చకుంటే ఓటుకు నోటు కేసుకు ముడి పెట్టారని ప్రజలకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. కేటీఆర్ పగటి కలలు కంటున్నాడని తెలిపారు. హైదరాబాద్ యూటి కావాలని కేటీఆర్ కోరుకుంటున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Ashu Reddy : నా బాడీ సూపర్ డీలక్స్ అంటున్న అషు రెడ్డి..