తెలంగాణ భవన్‌లో కార్మికులను ఉద్దేశించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మన బ్రతుకు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో మర్చిపోయి కూడా లంగలకు, దొంగలకు ఓట్లు వేయొద్దని ఆయన కోరారు. హృదయం లేని మనిషి ప్రధాని మోడీ అని ఆయన విమర్శించారు. కార్పొరేట్లకు 14 లక్షలు కోట్లు మాఫీ చేశాడు. ఇది తప్పని బండి సంజయ్, కిషన్ రెడ్డి నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని, మోడీ కార్పొరేట్ దోస్త్ లకు ఖర్చు పెట్టే డబ్బు….. దేశ రైతాంగానికి ఖర్చు పెట్టొచ్చునన్నారు కేటీఆర్. శ్రీరాముడు అందరి వాడు. లంగలకు దొంగలకు ఓట్లు వెయ్యండని చెప్పలేదని, ఫ్రీ బస్సుతో మహిళలు సంతోషంగా ఉండాల్సింది పోయి జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారన్నారు.
Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ కార్యకర్తల కోసం నా ప్రాణాలైన ఇస్తా
కడుపులో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్ ను పోగొట్టుకున్నామని కేటీఆర్ తెలిపారు. కడియం శ్రీహరి వరంగల్ లో వెన్ను పోటు పొడిచి గొంతు కోసి పారిపోతే మాదిగ బిడ్డ సుధీర్ కుమార్ కు అవకాశం ఇచ్చినమని, తెలంగాణ అంటేనే కేసీఆర్…. కెసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని రేవంత్ చూస్తున్నాడన్నారు. తన మాజీ బాస్ తో కలిసి మళ్ళీ ఉమ్మడి రాష్టంగా చేసి కెసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు కేటీఆర్.
Mobile Hacking: ఫోన్లో ఇలాంటివి వాడుతున్నారా ? అయితే డేటా లీకయ్యే ఛాన్స్..తస్మాత్ జాగ్రత్త..