‘‘మనీష్ సిసోడియా అక్కడ ఉండుంటే..’’ స్వాతిమలివాల్ సంచలన వ్యాఖ్యలు..
రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో దాడి జరగడం సంచలనంగా మారింది. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తను చెంపపై ఏడెనిమిది సార్లు కొట్టాడని, తన కడుపులో, ఛాతిపై తన్నాడని ఆమె ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం ఎన్నికల ముందు ఆప్‌కి ఇబ్బందికరంగా మారింది. మరోవైపు ఈ ఘటనపై కేజ్రీవాల్ ఇప్పటి వరకు మౌనంగా ఉన్నారు. మొత్తం వ్యవహారమంతా బీజేపీ వర్సెస్ ఆప్‌గా మారింది. బీజేపీ కేజ్రీవాల్ మౌనాన్ని ప్రశ్నిస్తోంది. నిందితుడికి అండగా నిలుస్తున్నాడని ఆప్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్న బిభవ్ కుమార్‌ని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు, కోర్టు 5 రోజుల పోలీస్ కస్టడీకి పంపింది. మరోవైపు నిందితుడి ఫోన్ ఫార్మాట్ చేశాడని, సీఎం నివాసంలోని సీసీటీవీ ఫుటేజీ ఖాళీగా ఉండని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.
అనంతపురం, పల్నాడులో దర్యాప్తు ముమ్మరం
తాడిపత్రిలో రూరల్ పోలీస్ స్టేషన్ లో సిట్ కొనసాగుతున్న సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఎనిమిది గంటలుగా అల్లర్ల ఘటనప్తె నమోద్తెయిన కేసుల వివరాలను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. పోలింగ్ ముందు, పోలింగ్ తరువాత జరిగిన గొడవలకు కారణాలను సంబంధించి ఎస్ హెచ్ ఓ లను అడిగి తెలుసుకుంటున్నారు. గొడవలకు సంబంధించి వీడియో పుటేజీలను సైతం పరిశీలిస్తున్నారు. సిట్ బృందాన్ని కలవడానికి వైసీపీ లీగల్ సెల్ సభ్యులు తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలో పోలీసులు వ్యవహారించిన తీరుప్తె వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
పల్నాడు జిల్లా పోలీసులపై సిట్ కు ఫిర్యాదు చేశాం
ఎన్నికల సమయంలో, పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థ దారుణంగా ఫెయిల్ అయిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లాలో సిట్ బృందం పర్యటిస్తోందని..ఆ బృందాన్ని కలిసి తాను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తొండపి అనే గ్రామంలో ఘర్షణల తో ఊరు ఊరంతా వలస పోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఆ స్థాయిలో గ్రామంలో దాడులు జరిగాయన్నారు. పోలీసు అధికారులు జోక్యం చేసుకొని తొండపి గ్రామంలో శాంతి భద్రతలను కాపాడాలని కోరారు. సీట్ విచారంలో పోలీసులే దోషులుగా తేలుతారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పోలీసుల పాత్ర పై దర్యాప్తు చేయాలన్నారు.
కర్నూల్ జిల్లాలో ముగ్గురు గుర్తుతెలియని మహిళల మృతదేహాలు గుర్తింపు..
కర్నూలు జిల్లా గార్గేయపురం చెరువులో ముగ్గురు మహిళల మృతదేహాల మిస్టరీ వీడటం లేదు. ముందుగా నగరవనం వైపు చెరువు ఒడ్డున ఒకే ప్రాంతంలో రెండు మృతదేహాలు కనిపించడగా.. ఆ తరువాత అవతలి ఒడ్డున మరో మహిళ మృతదేహం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మహిళల మృతదేహాలపై ఎలాంటి గాయాలు కనిపించడం లేదు. గుర్తు తెలియని ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారా.. ప్రమాదవశాత్తు పడిపోయారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారా.. పరిచయస్తులా అనేది తెలియాల్సి ఉంది.
రిజల్ట్ తర్వాత మాట్లాడుకుందాం.. లోకేష్ పై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్..
టీడీపీ కుట్ర పూరిత ఆరోపణలు చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. “లోకేశ్ ట్విట్టర్ లో మాపై తప్పుడు పోస్టులు పెడుతున్నాడు. నారాలోకేష్ లాంటి మూర్ఖులు బుద్ధి తక్కువ మాటలు, పప్పు లోకేష్ అందుకే అనేది. దేవినేని ఉమా ఐదేళ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి సీటు తెచ్చుకోలేక పోయావు. 2013 నుంచి ఆఫ్రికాలో మేము వ్యాపారం చేస్తున్నాం. ఇక్కడ నుంచి వాహనాలు, మెషినరీ అక్కడకు పంపిస్తున్నాము. మొదటి విడత 20 బండ్లు బాంబే పోర్ట్ నుంచి షిప్ లో పంపిస్తునాము. ఫెరో మగనీస్, సిలికాన్ మైనింగ్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. స్వర్ణ మెటల్స్ కు 100 వెహికల్స్ అవసరం ఉంది. ఇక్కడ నుంచి వాహనాలు పంపిస్తున్నాము. మేము వ్యాపారాలు చేసుకుంటూ రాజీయాల్లో ఉన్నాము. మేము విదేశాలకు పారిపోతున్నాము అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.” అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి డబల్ డిజిట్ వస్తుంది
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ యువమోర్చా సమావేశం నిర్వహించారు. ఈ యువమోర్చ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కి డబల్ డిజిట్ వస్తుందని, కాంగ్రెస్,బీఆర్‌ఎస్ కు చెందిన ఓటర్లు కూడా బిజెపికే ఓటు వేశారన్నారు. గత బీఅర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో అడుకుందని, కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందన్నారు. అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పారు ఇప్పుడు మరిచిపోయారని, 100 రోజులోనే 6 గ్యారంటీ లను అమలు చేస్తామని చెప్పి హామీలను అమలు చేయడం లేదన్నారు కిషన్ రెడ్డి. నిరుద్యోగులకు 4 వేల నిరుద్యోగ భృతి అన్నారు.. ఇప్పుడు ఏమో మేము అలాంటి హామీలు ఇవ్వలేదు అంటున్నారని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.
రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ
తెలంగాణ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్దిష్ట షరతులతో చర్చించడానికి ఆమోదం తెలిపింది. తెలంగాణ కేబినెట్ సమావేశంలో అత్యవసర అంశాలను మాత్రమే ప్రస్తావించాలని ఈసీ షరతు విధించింది. తక్షణం అమలు చేయాల్సిన అజెండా అంశాలపైనే మంత్రివర్గ సమావేశంలో దృష్టి సారించాలని స్పష్టం చేసింది. అదనంగా, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు రైతు రుణమాఫీ అంశాన్ని వాయిదా వేయాలని EC నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఈసీ గ్రీన్‌సిగ్నల్‌తో రేపు మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గం సమావేశం జరగనుంది. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికపై ఈ భేటీలో చర్చించనున్నారు. నివేదికలోని సిఫారసులు, తదుపరి కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. అలాగే.. ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై సమీక్షించనుంది. వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపైనా మంత్రివర్గంలో చర్చ జరగనుంది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఇరు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం మండిపడ్డారు. మే 27న జరగనున్న నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఇరు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని పట్టభద్రుల ఓటర్లను కోరారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతు కూడగట్టేందుకు ఆదివారం నల్గొండ జిల్లాలోని భోంగీర్, అలైర్ తదితర ప్రాంతాల్లో వేర్వేరుగా సమావేశాలను ఉద్దేశించి రామారావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా ఏటా 2కోట్ల ఉద్యోగాలు , మేక్ ఇన్ ఇండియా , డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాల హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వాగ్దానం చేసినట్లు ఏ రైతు అయినా తమ ఆదాయం రెట్టింపు అయ్యేలా చూశారా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశ్నించారు. యాదాద్రి ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వంటి ఆధునిక మౌలిక సదుపాయాలతో సహా మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ప్రయత్నాలతో పాటు, రాముడి కోసం అయోధ్య ఆలయ నిర్మాణంపై బిజెపి దృష్టిని ఆయన విభేదించారు .
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ క్రాష్.. హర్డ్ ల్యాండింగ్ అయినట్లు అనుమానం..
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్‌లో ఓ హెలికాప్టర్ అనుమానాస్పద స్థితిలో కుప్పకూలింది. హెలికాప్టర్‌కి ఏం జరిగింది, అందులో ఎవరు ఉన్నారు అనేదానిపై వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదం ఇరాన్ తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లో జరిగింది. అధ్యక్షుడు ఈ ప్రాంతంలో ప్రయాణిస్తున్న సమయంలో హెలికాప్టర్ కుప్పకూలింది. హెలికాప్టర్ కూలిన ప్రాంతానికి రెస్క్యూ సిబ్బంది వెళ్లిందని ఆ దేశ టెలివిజన్ ఆదివారం నివేదించింది.
ఏదిపడితే అది చెప్పి తప్పించుకుంట.. అంటే ప్రజలు నీ భరతం పడతారు…
సీఎం రేవంత్ బిల్డింగ్ పర్మిషన్ కి SFT కి 75 రూపాయలు వసూలు చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇవాళ నల్లగొండలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ ఇచ్చిన హామీలు అమలు చేయలేరని, ఏదిపడితే అది చెప్పి తప్పించుకుంట అంటే ప్రజలు నీ భరతం పడతారని ఆయన వ్యాఖ్యానించారు. అతి తక్కువ కాలంలో ప్రజలచేత చీకొట్టించుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు. కమీషన్ల దుకాణాలు ఓపెన్ చేశారని, ప్రభుత్వపరమైన ఆదాయాన్ని పెంచేదానికంటే వాళ్ళ ఆదాయం ఎలా పెంచుకోవాలో ఆలోచన చేస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఎస్.ఎఫ్.టి కి 75 రూపాయలు వసూలు చేయాలని ఫిక్స్ అయిందని.. రైట్ రాయల్ ట్యాక్స్ లెక్క.. ముగ్గురు మనుషులని పెట్టి వారు చెప్తేనే పర్మిషన్ ఇచ్చేటట్లుగా.. ఆ ముగ్గురికి డబ్బులు చెల్లించాలని నిర్ణయం జరిగినట్టు తెలుస్తుందన్నారు.