ఈ ఎన్నికల్లో అద్భుతమైన పోరాటపటిమ ప్రదర్శించిన క్షేత్రస్థాయి భారత రాష్ట్ర సమితి శ్రేణులు అందరికీ, పార్టీ నాయకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎదురుదెబ్బలు ఎన్ని కొట్టావు అన్నది కాకుండా.. ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా సవాళ్లు ఎదుర్కొని తిరిగి నిలబడి పోరాటం చేశామన్నదే ముఖ్యం అన్న నానుడిని నిజం చేసిన పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత తిరిగి బలంగా నిలబడి కొట్లాడడం ఆషామాషి వ్యవహారం…
నెల్లూరు రాజకీయాలను వీళ్లు నీచ స్థాయికి తీసుకువచ్చారు.. విజయసాయి రెడ్డి ఫైర్ నెల్లూరు రాజకీయాలను టీడీపీ అభ్యర్ధులు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్‌లు నీచ స్థాయికి తీసుకువచ్చారని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలోనే వీళ్ళందరూ దుష్టశక్తులుగా మారిపోయారని దుయ్యబట్టారు. వైసీపీకీ వెన్నుపోటు దారుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్లందరికీ సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీచ రాజకీయాలు…
ఎన్నికల్లో బీజేపీని ఓడించి పాతిపెడితే దేవుడికి ఏమీ పట్టదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శనివారం అన్నారు. ‘బీజేపీ నేతలు ఎప్పుడూ శ్రీరాముడి గురించే మాట్లాడతారు. మనం కూడా శ్రీరాముని పూజిస్తాం. హుజూరాబాద్‌లో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు పండుగలు, ఇతర సంప్రదాయాలతోపాటు అన్నీ నేర్పిస్తున్నారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రజల పక్షాన పోరాడి మరింత బలంగా పుంజుకుంటాం అని కేటీఆర్ అన్నారు. కరీంనగర్లో మూడు రాజకీయ పార్టీల మధ్య పోటీ నెలకొంది. మాజీ…
Bandi Sanjay: నీ గడీలు బద్దలు కొట్టిం..నీ మెడలు వంచి..నీ ప్రభుత్వాన్ని గద్దె దించి.. నిన్ను ఫామ్ హౌస్ నుంచి గుంజుకొచ్చి ధర్నా చౌక్ వద్ద నిలబెట్టింది నేనే అంటూ కేసీఆర్ పై కరీంనగర్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
KTR: నిర్మల్ జిల్లా భైంసాలో నిన్న కేటీఆర్ రోడ్ షో లో కేటీఆర్ పై టమాటాల దాడి కేసులో 23 మందిపై కేసులు నమోదయ్యారు. అందులో 17 మంది హనుమాన్ దీక్ష పరులు ఉండటం గమనార్హం.
రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అని మోసం చేశారని, ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా రేవంత్ రెడ్డి డేట్లు మారుస్తున్నాడని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ లో 10 ,12 సీట్లు మాకు ఇవ్వండని కోరారు. ఆరు నెలల్లో తెలంగాణ లో మళ్ళీ కేసీఆర్.. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నమో అంటే నమ్మించి మోసం చేసే టోడు అని ఆయన అభివర్ణించారు. 2…
నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ కు ముందే హనుమాన్ దీక్షాపరులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గతంలో కేటీఆర్ జై శ్రీరామ్ అనే మాట అన్నం పెడుతుందా..! అని అన్న వ్యాఖ్యలకు నిరసనగా హనుమాన్ మాలధారులు జై శ్రీరాం నినాదాలు చేస్తూ కేటీఆర్ రాకకు నిరసన తెలిపారు. కొద్దిసేపు పోలీసులకు, స్వాములకు…
కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన “నోట్లతో నిండిన టెంపో” వ్యాఖ్యలకు ధీటుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గురువారం మాట్లాడుతూ.. డీ-మానిటైజేషన్ విఫల ప్రయత్నమని ప్రధాని మోదీ భావిస్తున్నారా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన సమయంలో కాంగ్రెస్‌కు అదానీ, అంబానీలు టెంపోల నిండుగా డబ్బు పంపుతున్నారని ప్రధాని మోదీ అన్నారని, ఆయన మాట ప్రకారం కాంగ్రెస్‌కి వాళ్లు అంతగా డబ్బు పంపుతుంటే ఈడీ, సీబీఐ, ఐటీలు ఎందుకు మౌనంగా ఉన్నాయని…
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్ అప్రజాస్వామికమని, ఆయనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. యూనివర్సిటీ హాస్టళ్లకు వేసవి సెలవులు, మెస్‌లకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నకిలీ సర్క్యులర్‌ను పోస్ట్ చేసిన ఆరోపణలపై క్రిశాంక్‌ని అరెస్టు చేశారు. బుధవారం క్రిశాంక్‌ను కలిసిన అనంతరం చంచల్‌గూడ జైలు వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడిన రామారావు, తనను వేధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్రిశాంక్‌పై…